Breaking News

Lionel Messi: భారీ బందోబస్తు

Published on Sat, 12/13/2025 - 07:39

ఉప్పల్‌: అంతర్జాతీయ ఫుట్‌బాల్‌ దిగ్గజం మెస్సీ మ్యాచ్‌కు భారీ బందోబస్తు కల్పించినట్లు రాచకొండ సీపీ సుధీర్‌ బాబు తెలిపారు. 3000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు చెప్పారు. స్టేడియం బయటా లోపలా కలిపి 450 సీసీ కెమేరాలు ఏర్పాటు చేశామన్నారు. డ్రోన్‌ కెమెరాలను అమర్చి పర్యవేక్షణ కోసం మినీ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు.  

శుక్రవారం ఆయన ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో మాట్లాడారు. మెస్సికి జెడ్‌ కేటగిరీ బందోబస్తు ఉంటుందని సీపీ వెల్లడించారు. ఆయన ప్రయాణానికి ఆటంకం ఏర్పడకుండా ప్రత్యేక గ్రీన్‌ చానల్‌ రూట్‌మ్యాప్‌ అమలు చేస్తున్నట్లు తెలిపారు. 

స్టేడియం వద్ద టికెట్‌ విక్రయాల్లేవ్‌..  
స్టేడియం ఆవరణలో, పరిసర ప్రాంతాల్లో టికెట్లను, పాస్‌లను విక్రయించడం లేదని సీపీ స్పష్టం చేశారు. టికెట్‌ లేనివారు స్టేడియం వద్దకు ఎట్టి పరిస్థితుల్లో రావద్దన్నారు. మ్యాచ్‌ను టీవీల్లో వీక్షించాలని సూచించారు. 

3 గంటల ముందే అనుమతి... 
టికెట్లు, పాస్‌లున్న వారిని స్టేడియంలోకి  3 గంటల ముందే అనుమతించనున్నట్లు సీపీ తెలిపారు. ఆట ప్రారంభమయ్యే సమయానికి వచ్చి ఆందోళన పడవద్దని సూచించారు. 

ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు సాధ్యమైనంత వరకు మెట్రో రైల్, ఆర్టీసీ సేవలను వినియోగించు కోవాలన్నారు మహిళల భద్రతకు ప్రత్యేకంగా షీటీంలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిరీ్ణత స్థలంలోనే  వాహనాలను పార్కు చేయాలని సీపీ సూచించారు. 

టికెట్‌ ఒకసారి స్కాన్‌ అయిందంటే..  
మ్యాచ్‌కు సంబంధించిన టికెట్ల విషయంలో నిర్వాహకులు అనంత్‌ మాట్లాడుతూ.. టికెట్‌ మొబైల్‌లో సాఫ్ట్‌ కాపీ రూపంలోనే ఇస్తారని, క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసిన తర్వాత ప్రవేశం ఉంటుందన్నారు. ఒకసారి స్కాన్‌ అయితే మళ్లీ వినియోగించే అవకాశం ఉండదన్నారు. పాస్‌ హోల్డర్‌లు బార్‌ కోడ్‌ ఉన్న ఫిజికల్‌ పాసులు మాత్రమే చెల్లుబాటవుతాయన్నారు, జిరాక్స్, స్క్రీన్‌ షాట్‌లను అనుమతించబోమన్నారు.   

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)