Breaking News

ముగిసిన ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ

Published on Fri, 02/24/2023 - 17:48

హైదరాబాద్‌: కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. సీబీఐ విచారణలో భాగంగా ఈరోజు(శుక్రవారం) హైదరాబాద్‌కు వచ్చిన అవినాష్‌రెడ్డి.. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. తనకు తెలిసిన వాస్తవాలే సీబీఐకి చెప్పానని ఈ సందర్భంగా అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. సరైన దిశలో విచారణ జరగాలనే తాను చెబుతున్నానని, వాస్తవాన్ని టార్గెట్‌ చేయకుండా వ్యక్తిని టార్గెట్‌ చేసి విచారణ జరుగుతోందని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.

‘సీబీఐ ప్రశ్నలకు నాకు తెలిసిన సమాధానాలు చెప్పా.  సీబీఐ కౌంటర్‌కు సంబంధించిన ప్రశ్నలు అడిగారు..అన్నింటికీ సమాధానాలు చెప్పా. విచారణపై ఎవరికైనా సందేహాలు వస్తాయి. వివేకా చనిపోయిన రోజున మార్చురీ దగ్గర  ఏం మాట్లాడానో ఇప్పుడు కూడా అదే చెబుతున్నా.  అదే వాస్తవం. నేను వెళ్లే సమయానికి లెటర్‌ను దాచిపెట్టారు. ఆ లెటర్‌లో అనేక విషయాలు ఉన్నాయి. 

విచారణ జరుగుతుండగానే మీడియానే ట్రయల్‌ చేసి దోషులు ఎవరో తేల్చేస్తున్నారు. విజయమ్మ దగ్గరకు వెళ్లి వస్తే బెదిరించడానికి వెళ్లానని ప్రచారం చేశారు. తెల్లవారజామున మూడు గంటలకు ఫోన్లు చేశానంటూ డిబేట్లు పెట్టారు. తప్పుడు వార్తలు వేయకుండా నిజాలను నిజాలుగా వేయండి. మీడియా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. 

టీడీపీ చేసిన విమర్శలే సీబీఐ కౌంటర్‌లో వస్తున్నాయంటే.. గూగుల్‌ టేకౌటా లేక టీడీపీ టేకౌటా అనేది భవిష్యత్‌లో తేలుతుంది.విచారణ సందర్భంగా ఆడియో, వీడియో రికార్డ్‌ చేయాలని కోరాం. ఎక్కడ ఆడియో, వీడియో రికార్డు చేసినట్లు కనిపించలేదు.  నేను సీబీఐకి లేఖ ఇచ్చాను. నేను సీబీఐ దృష్టికి తీసుకెళ్లిన అంశాలపై పూర్తి విచారణ చేయాలని కోరాను. మరోసారి విచారణకు రావాలని సీబీఐ నాకు చెప్పలేదు’ అని అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)