Breaking News

నాతో మాట్లాడేందుకు టైం లేదు.. ఫోన్‌లో మాత్రం బిజీ!

Published on Mon, 06/22/2026 - 11:09

సూర్యాపేట: భార్య కాపురానికి రావడంలేదని మద్యం మత్తులో సెల్‌టవర్‌ ఎక్కి యువకుడు హల్‌చల్‌ చేశాడు. ఈ ఘటన ఆదివారం భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోచంపల్లి పట్టణంలోని పాత హరిజనవాడకు చెందిన కరగల్ల బాలస్వామి ఆరేళ్ల క్రితం పెద్దగూడెంకు చెందిన ఒంటెద్దు బాలమణిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. జేసీబీ డ్రైవర్‌గా పనిచేసే బాలస్వామి నిత్యం మద్యం సేవించి భార్యను కొడుతుండేవాడు. ఇదిలా ఉండగా భార్య కూడా ఇతరులతో తరచూ ఫోన్‌లో మాట్లాతుండటం వల్ల ఇద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. 

ఈ క్రమంలో నాలుగు రోజుల క్రితం భార్యాభర్తలు గొడవపడగా.. బాలమణి రాయితో బాలస్వామిని కొట్టడంతో తలకు గాయమైంది. అనంతరం పిల్లలను తీసుకొని బాలమణి పుట్టింటికి వెళ్లిపోయింది. ఆదివారం ఉదయం బాలస్వామి మద్యం సేవించి తన భార్యను కాపురానికి తీసుకురావాలని పోచంపల్లి పట్టణంలోని ఇండియన్‌ పెట్రోల్‌ బంక్‌ ప్రక్కన ఉన్న సెల్‌టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేశాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐలు భాస్కర్‌రెడ్డి, లైలా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలస్వామి భార్యాపిల్లలను పిలిపించారు. కిందకు దిగిరావాలని ప్రాథేయపడగా.. 

కిందకి దిగుతున్నట్లు చేసి తిరిగి పైకి ఎక్కుతుండగా బిహార్‌కు చెందిన ఇద్దరు యువకులు చాకచక్యంగా టవర్‌ ఎక్కి అతడిని పట్టుకొని కిందికి తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. పోలీసులు స్టేషన్‌కు తరలించి భార్యాభర్తలిద్దరికి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. ఇదిలా ఉండగా 11వ వార్డులో ఉన్న సెల్‌టవర్‌ కూడా బాలస్వామి ఎక్కగా.. టవర్‌ పైన కోతులు ఉండటంతో భయంతో కిందికి దిగివచ్చాడని స్థానికులు తెలిపారు. 

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)