Breaking News

అన్నయ్య సారీ రా...

Published on Wed, 04/16/2025 - 13:45

ఆదిలాబాద్(బెల్లంపల్లి): కొంతకాలంగా అనారో గ్యంతో బాధపడుతున్న ఓ యువకుడు చికిత్స చేయించుకున్నా మెరుగు పడకపోవడంతో మనస్తాపం చెందాడు. అనారోగ్యం బాధను భరించలేకపోయాడు. ఇక చావే శరణ్యమనుకున్నాడు. ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం జెండా వెంకటాపూర్‌లో జరిగింది. ఆత్మహత్యకు ముందు సూసైడ్‌ నోట్‌ రాశాడు. ఎస్సై ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చెల్మాటికారి సత్తయ్య, అమృత దంపతుల కుమారుడు అనిల్‌ (24) పీజీ పూర్తిచేసి ఇంటివద్దే ఉంటున్నాడు. 

కొంతకాలంగా పచ్చకామెర్లు, దవడ బిల్లలు, వైరల్‌ ఫీవర్‌తో బాధపడుతున్నాడు. చికిత్స చేయించినా నయం కాకపోవడంతో మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఇంట్లోనే దూలానికి చీరతో ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. ఉరేసుకునే ముందు బెడ్‌రూమ్‌లో అతని మంచంపై సుసైడ్‌ నోట్‌ రాసిపెట్టాడు. ‘అమ్మా.. నన్ను క్షమించండి.. నాకు ఆరోగ్యం బాగుండడంలేదు. బాధ భరించలేక చనిపోతున్నా. నా చావుకు ఎవరూ కారణం కాదు. నా సొంత నిర్ణయంతో చనిపోతున్నా. అన్నయ్య సారీ రా... నీవు ఈ లెటర్‌ చదివే సమయానికి నేను నీతో ఉండను.. అమ్మా నాన్నను కష్టపెట్టకు.. నన్ను మీరంతా క్షమిస్తారని ఆశిస్తూ.. సెలవు తీసుకుంటున్నా.. అని నోట్‌ రాసి ఉంచాడు. మృతుని తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.

నేత్రదానం
అనిల్‌ కళ్లు దానం చేయడానికి తల్లిదండ్రులు ముందుకు వచ్చి సోపతి వెల్ఫేర్‌ సొసైటీ అధ్యక్షుడు భీం పుత్ర శ్రీనివాస్, బ్లడ్‌ డోనర్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రహీమ్‌కు సమాచారం అందించారు. దీంతో వారు హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్‌ ఐ బ్యాంకు టెక్నీషియన్‌ ప్రదీప్‌కుమార్‌కు తెలియజేయడంతో గ్రామానికి వచ్చి నేత్రాలు సేకరించారు.    

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)