Domalguda: నీటి సంపులో యువతి అస్తిపంజరం

Published on Tue, 04/22/2025 - 08:50

కవాడిగూడ(హైదరాబాద్‌): లోయర్‌ ట్యాంక్‌ బండ్, డీబీఆర్‌ మిల్స్‌లోని నీటి సంపులో గుర్తుతెలియని యువతి అస్తిపంజరం బయటపడింది. ఆలస్యంగా వెలుగులోకి వచి్చన ఈ ఘటన ఆదివారం దోమల గూడ పీఎస్‌ పరిధిలో చోటు చేసుకుంది. డీఆర్‌ఆర్‌మిల్స్‌ 40 ఏళ్ల క్రితమే మూతపడింది. సెక్యురిటీ సిబ్బంది ఆదివారం సాయంత్రం మూత్ర విసర్జన కోసం పురాతన భవనం వైపు వెళ్లాడు. 

అనంతరం నీటి కోసం 3వ అంతస్తులో ఉన్న సంపు మూత తెరిచి చూడగా యువతి మృత దేహం కనిపించింది. దీంతో అతను వెంటనే దోమల గూడ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సోమవారం ఉదయం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి వయస్సు 25 నుంచి 35 ఏళ్లలోపు వయస్సు ఉంటుందని భావిస్తున్నారు. ఆరు నెలల క్రితం ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి  సంపులో పడవేసి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

 మృత దేహం పూర్తిగా కుళ్లిపోవడంతో నీటి సంపును పగల గొట్టారు. క్లుస్‌ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. గుర్తుతెలియని వ్యక్తులు సదరు యువతిని ఇక్కడికి తీసుకువచ్చి అత్యాచారం చేసి హత్య చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తీసుకెళ్లలేని పరిస్థితి ఉండటంతో గాంధీ ఆసుపత్రి ఫోరెన్సిక్‌ సిబ్బందిని రప్పించి సోమవారం మధ్యాహ్నం అక్కడే పోస్టు మార్టం నిర్వహించారు. దోమల గూడ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ నిరంజన్‌ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)