Breaking News

డాక్టర్‌ చదువుకు డబ్బుల్లేక..కూలి పనులకు..

Published on Mon, 10/28/2024 - 06:23

హుస్నాబాద్‌ రూరల్‌:  వైద్యురాలు కావాలన్నది ఆ అడవి బిడ్డ తపన.. అందుకోసం కూలి పనులు చేస్తూనే కష్టపడి చదివింది. నీట్‌లో 447 మార్కులు సాధించింది. ప్రైవేటు కాలేజీలో సీటు రావడంతో ఫీజులకు డబ్బుల్లేక.. ఎప్పట్లాగే తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మండలం భల్లునాయక్‌ తండాకు చెందిన లావుడ్య లక్ష్మి, రమేశ్‌ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. దంపతులు కూలిపని చేస్తూ కూతుళ్లను చదివిస్తున్నారు. పెద్ద కూతురు బీ–ఫార్మసీ చేస్తోంది. చిన్న కూతురు దేవిని కరీంనగర్‌ జిల్లా ఎల్లారెడ్డి గురుకులంలో చేరి్పంచి చదివించారు.

పదో తరగతి, ఇంటర్మిడియెట్‌లో మంచి మార్కులు సాధించిన దేవి.. డాక్టర్‌ కావాలన్న లక్ష్యంతో ఏడాదిగా తల్లిదండ్రులతో పాటు కూలి పనులకు వెళ్తూనే నీట్‌కు సిద్ధమైంది. నీట్‌లో 447 (2లక్షల 80 వేల ర్యాంకు) మార్కులు సాధించడంతో తల్లిదండ్రులు సంతోషపడ్డారు. ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో సీటు వస్తుందని అశించిన లావుడ్య దేవికి.. సిద్దిపేట సురభి మెడికల్‌ కాలేజీలో సీటు వచి్చంది.

 ప్రైవేటు మెడికల్‌ కాలేజీలో చదువుకు ఏటా రూ.3.5 లక్షల వరకు ఖర్చవుతుంది. అంత స్థోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో.. చేసేదిలేక దేవి కూలి పనులకు వెళ్తోంది. ఆస్తులు అమ్మి ఫీజు కడదామంటే అడవిలో పెంకుటిల్లు ఒకటే దిక్కు. దానిని కొనేవారు కూడా ఎవరూ లేరు. దాతలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేస్తే తమ బిడ్డ ఆశయం నెరవేరుతుందని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)