Breaking News

డాడీ ఇది నా చివరి కోరిక..

Published on Mon, 11/10/2025 - 07:32

జనగామ జిల్లా: హాస్టల్‌ భవనంపై నుంచి దూకి యువతి (ప్రైవేట్‌ ఉద్యోగి) ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలో జరిగింది. ఎస్సై చెన్నకేశవులు, స్థానికుల వివరాలు వెల్లడించారు. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం ముద్దునూరు గ్రామానికి చెందిన వి.మౌనిక జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ షోరూంలో పని చేస్తోంది. రాత్రి హాస్టల్‌కు వచ్చిన ఆమె తెల్లవారుజామున హాస్టల్‌ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్‌ అయ్యాయి. రెండు కాళ్లు విరిగి, తీవ్రగాయాల పాలైన మౌనికను సహచరులు, స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి వరంగల్‌ ఎంజీఎంకు రెఫర్‌ చేశారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.  

డాడీ ఇది నా చివరి కోరిక..
ఘటనా స్థలంలో మౌనిక వద్ద ఉన్న సూసైడ్‌ నోట్‌ను ఎస్సై చెన్నకేశవులు స్వాధీనం చేసుకున్నారు. అందులో మౌనిక.. ‘డాడీ నా గురించి తప్పుగా అనుకోకు. నా చావుకు ఎవరూ బాధ్యులు కాదు. ఎవరినీ ఏమనొద్దు. నా మరణం వల్ల ఎవరూ ఇబ్బంది పడవద్దు.. ఇదే నా చివరి కోరిక’అంటూ అందులో పేర్కొంది. అమ్మ, డాడీ, గణేశ్‌ గుడ్‌ బాయ్, టేక్‌ కేర్‌ ఆల్, ఐ లవ్‌ యూ నాన్న అని రాసి హాస్టల్‌ భవనంపై నుంచి దూకగా.. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని తీవ్ర గాయాలతో హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. ఘటనపై ప్రాథమిక వివరాలు తీసుకున్నామని, కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు వచి్చన వెంటనే దర్యాప్తు చేస్తామని ఎస్సై చెన్నకేశవులు తెలిపారు. 

#

Tags : 1

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు