Breaking News

మేనబావతో పెళ్లి ఇష్టం లేక రైల్లోనుంచి దూకిన యువతి

Published on Sun, 11/01/2026 - 07:20

జనగామ జిల్లా: ఇష్టంలేని పెళ్లి సంబంధంతో మనస్తాపానికి గురైన ఓ యువతి రైలులోనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండల పరిధిలో శనివారం తెల్ల వారుజామున చోటుచేసుకుంది. రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ ఉపేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా నర్మెట మండలం అమ్మాపురానికి చెందిన కుంటి బాబురావు కుటుంబం సుమారు 20 ఏళ్ల క్రితం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం శేషగిరినగర్‌ కాలనీకి వెళ్లి స్థిరపడ్డారు. బాబురావు ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన కుమార్తె శ్రావణి (24) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తోంది. చిన్నప్పటినుంచి తల్లిదండ్రుల గారాలపట్టిగా పెరిగిన ఆమెకు కొంతకాలం క్రితం మేనబావతో వివాహం నిశ్చయమైంది.

రైలు ప్రయాణంలో విషాదం..
గత నెల30వ తేదీ (శుక్రవారం) రాత్రి పెళ్లిదుస్తులు కొనుగోలు చేసేందుకు శ్రావణి మణుగూరు ఎక్స్‌ప్రెస్‌ రైలులో సికింద్రాబాద్‌కు బయలుదేరింది. ప్రయాణ సమయంలో ఒకట్రెండుసార్లు కుటుంబ సభ్యులతో ఫోన్‌ లో మాట్లాడింది. శనివారం తెల్ల వారుజామున సుమారు 2.30 గంటల సమయంలో రఘునాథపల్లి మండల శివారు ప్రాంతంలో రైలులోనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు గుర్తించారు.

టికెట్‌ ఆధారంగా గాలింపు..
ఖమ్మం సమీపంలోకి రైలు వచ్చాక శ్రావణి ఫోన్‌కాల్స్‌ స్వీకరించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె రిజర్వేషన్‌ టికెట్‌ను హైదరాబాద్‌లో ఉంటున్న మేనబావకు పంపించారు. అతను హుటాహుటిన జనగామ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రైలు జనగామ స్టేషన్‌లో ఆగగానే టికెట్‌ ఆధారంగా రిజర్వేషన్‌ బోగీలో తనిఖీ చేయగా ఆమె బ్యాగు మాత్రమే కనిపించింది. శ్రావణి కనిపించకపోవడంతో వెంటనే రైల్వే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు గాలింపు చేపట్టగా తెల్లవారుజామున రఘునాథపల్లి సమీపంలో రైల్వే పట్టాల పక్కన ఆమె మృతదేహాన్ని గుర్తించారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని శ్రావణిది గుర్తించారు.

తల్లిదండ్రులకు తీరని శోకం..
మేనబావతో వివాహం ఇష్టం లేకపోవడం, అనారోగ్య సమస్యలతో మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే పోలీసులు చెప్పారు. ఈ నెల 29న ఆమె వివాహం జరగాల్సి ఉండగా, ఉద్యోగం చేస్తూ జీవితంలో స్థిరపడుతున్న కుమార్తె ఇక లేదన్న వార్తతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పెళ్లి సందడి ఉండాల్సిన ఇంట్లో విషాదం అలుముకుంది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ ఉపేందర్‌ కేసు నమోదు చేశారు. మృతదేహానికి జనగామ జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఉపేందర్‌ తెలిపారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)