Breaking News

తండ్రి భయంతో బాల్కనీ దాటే ప్రయత్నం..

Published on Sat, 12/20/2025 - 07:33

రామచంద్రాపురం (పటాన్‌చెరు): ఇంట్లో స్నేహితుడితో ఉన్న సమయంలో అకస్మాత్తుగా తండ్రి రావడం చూసి భయపడిన కూతురు.. తమ బాల్కనీ నుంచి మరో బాల్కనీకి వెళ్లే ప్రయత్నంలో ఎనిమిదో అంతస్తు పైనుంచి కిందపడి మృతి చెందింది. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌ పరిధిలోని ప్రభుత్వ డబుల్‌ బెడ్‌ రూమ్‌ కేసీఆర్‌ నగర్‌లో గురువారం రాత్రి ఈ సంఘటన జరిగింది. కొల్లూరు సీఐ గణేశ్‌ పటేల్‌ కథనం ప్రకారం.. హైదరాబాద్‌ పాతబస్తీలో నివాసముండే యువతి (20) ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తోంది. అక్కడ ఆమెకు ఓ యువకుడితో పరిచయం ఏర్పడింది.

 ఆ యువతి కుటుంబానికి తెల్లాపూర్‌ పరిధిలోని ప్రభుత్వ డబుల్‌ బెడ్‌రూమ్‌ కాలనీలో ఇల్లు ఉంది. కాగా గురువారం స్నేహితుడితో కలిసి కేసీఆర్‌ నగర్‌ కాలనీలోని 8వ అంతస్తులో ఉన్న తమ ఇంటికి వచ్చింది. వారిద్దరూ ఇంట్లో ఉన్న సమయంలో రేషన్‌ బియ్యం తీసుకునేందుకు నగరం నుంచి యువతి తండ్రి అక్కడికి వచ్చాడు. తలుపులకు తాళం తీసి ఉండటంతో.. లోపల ఎవరున్నారని అతను గట్టిగా అరిచాడు. తండ్రి మాటలు విన్న యువతి భయంతో ఎనిమిదో అంతస్తు బాల్కనీ నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పక్క బాల్కనీలోకి వెళ్లేందుకు ప్రయత్నించింది. అయితే పట్టుతప్పి ఆమె పైనుంచి కింద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Videos

భారీగా తగ్గిన బంగారం ధర

దీపా జ్యువెల‌ర్స్‌కు ఇన్వెస్ట‌ర్ల క్యూ అన్ని కోట్లు వ‌స్తాయా?

ప్రభుత్వ హామీలపై బాబుపై రెచ్చిపోయిన వెంక ట్రామిరెడ్డి

టెట్ లేకుండా ఉద్యోగాలా? DSC అక్రమాలపై YSRCP ఎమ్మెల్సీల దీక్ష

ఆసియా కప్‌లో దాయాదుల పోరు, భారత్ Vs పాక్ మ్యాచ్.. ఎలా చూడాలంటే..?

సోషల్ మీడియా అకౌంట్లు తొలగింపు బాబు, లోకేష్ పై జగన్ ఫైర్

అమ్మాయి దొరకకపోతే బోనులో నుంచుంటావ్.. DGPకి జస్టిస్ బట్టు దేవానంద్ వార్నింగ్...

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు