Breaking News

సోదరునికి రాఖీ కట్టేందుకు వచ్చి..

Published on Sun, 08/10/2025 - 04:59

సిద్దిపేట కమాన్‌: సోదరుడికి రాఖీ కట్టేందుకు హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వెళ్తున్న యువతికి అదే చివరి రోజు అయ్యింది. రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందగా.. తల్లి, మేనమామకు గాయాలయ్యాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో శివారులో శనివారం జరిగిన ఈ సంఘటనపై సిద్దిపేట టూటౌన్‌ సీఐ ఉపేందర్‌ తెలిపిన వివరాలివి. చిన్నకోడూరు మండలం గోనెపల్లికి చెందిన తాళ్లపల్లి పర్షరాములు ప్రైవేటు ఉద్యోగం చేస్తూ ప్రస్తుతం గజ్వేల్‌ పట్టణంలో భార్య పల్లవి, కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. వీరి కూతురు తాళ్లపల్లి శృతి (24) ఎం ఫార్మసీ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తోంది. 

పర్షరాములు భార్య పల్లవి సిద్దిపేటలోని తమ్ముడు నాగిళ్ల శ్రీనివాస్‌కు రాఖీ కట్టేందుకు.. కూతురు శృతితో కలిసి గజ్వేల్‌ నుంచి సిద్దిపేటకు వచ్చారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌ తన భార్య, అక్క పల్లవి, మేనకోడలు శృతితో కారులో అల్లీపూర్‌ గ్రామానికి వెళ్లి భార్యను అక్కడ దింపేశాడు. అనంతరం మహారాష్ట్ర నుంచి వచ్చిన సోద రుడు లింగంకు రాఖీ కట్టేందుకు శృతి.. తన తల్లి పల్లవి, మేనమామ శ్రీనివాస్‌తో కలిసి నంగునూర్‌ మండలం నర్మెటకు బయలుదేరింది. 

ఈ క్రమంలో పట్టణ శివారు రాజీవ్‌ రహదారిపై శ్రీనివాస్‌ నడుపుతున్న కారు టైరు పంక్చర్‌ కావడంతో.. నెమ్మది గా రోడ్డు పక్కకు తీసేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో కరీంనగర్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ రాజధాని బస్సు.. వెనుకనుంచి వేగంగా వచ్చి కారును ఢీకొట్టింది. దీంతో కారు వెనక సీట్లో కూర్చున్న శృతి తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. శృతి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. శ్రీనివాస్‌. ఆయన సోదరి పల్లవికి స్వల్ప గాయాలవడంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)