Breaking News

మూడేళ్ల ప్రేమ తర్వాత పెళ్లి.. రెండు రోజులకే జీవితంలో సుడిగుండం..

Published on Wed, 01/04/2023 - 11:39

మనోహరాబాద్‌(తూప్రాన్‌): ప్రేమించాడు..పెళ్లి చేసుకున్నాడు.. రెండురోజులకే ఇద్దరి కులాలు వేరంటూ వదిలేశాడు. తనకు న్యాయం చేయాలంటూ ఆ యువతి వేడుకున్నా కనికరించలేదు. దీంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగింది. నెల రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. దీంతో మృతురాలు కుటుంబీకులు, బంధువులు మృతదేహాన్ని ఆ యువకుడి ఇంటి వద్ద ఉంచి ఆందోళనకు దిగారు. ఈ విషాద ఘటన ఉమ్మడి మెదక్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. తుప్రాన్‌ మండలపరిధిలోని ధర్మరాజ్‌పల్లి గ్రామానికి చెందిన యశ్వంత్‌రెడ్డి, అదే గ్రామానికి చెందిన బాషబోయిన తేజశ్రీ (18)లు మూడు సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. గతేడాది అక్టోబర్‌ 15న  పెళ్లి చేసుకున్నారు. అక్టోబర్‌ 19న పోలీస్‌స్టేషన్‌లో ఇద్దరు కాపురం చేసుకుంటామని ఒప్పుకున్నారు. అయితే ఇద్దరి కులాలు వేరుకావడంతో విభేదాలు వచ్చాయి. యువతికి అండగా కులపెద్దలు  ఉండి పెద్ద ఎత్తున నిరసనలు తెలిపినా ఎలాంటి న్యాయం జరగలేదు. 

దీంతో, ఆ యువతి పురుగుల మందు తాగింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. నెల రోజులుగా చికిత్స పొందుతున్న తేజశ్రీ మంగళవారం వేకువజామున మృతి చెందింది. తేజశ్రీ మృతదేహాన్ని యశ్వంత్‌రెడ్డి ఇంటివద్ద ఉంచి ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ శ్రీధర్, ఎస్‌ఐ సందీప్‌రెడ్డిలు సంఘటన స్థలానికి వచ్చి ఆందోళనకారులకు నచ్చజె ప్పారు. పోలీసులు చివరికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి అంత్యక్రియలు చేశారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)