Breaking News

బాలికను మభ్య పెట్టి.. ఫొటోలు తీయించి

Published on Wed, 11/27/2024 - 04:48

మంథని: ఫొటోలు తీసి ఓ వ్యక్తికి పంపిస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని, కనకవర్షం కురుస్తుందని ఓ విద్యార్థినికి వంట మనిషి మాయమాటలు చెప్పింది. తన గదిలోకి తీసుకెళ్లి ఓ యువకుడితో ఫొటోలు తీయించింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో కలకలం సృష్టించింది. అధికారుల కథనం ప్రకారం.. మంథనిలోని పాఠశాలలో పదో తరగతి చదువుతూ ఓ వసతి గృహంలో ఉంటున్న బాలికను ఈ నెల 18న ఆ హాస్టల్‌ వంట మనిషి తన గదికి తీసుకెళ్లింది. 

ఓ యువకుడిని పిలిపించి బాలిక ఫొటోలు తీయించిన తర్వాత బాలికను యధావిధిగా పాఠశాలకు పంపించింది. మరుసటిరోజు ఆ బాలిక తన చిన్నమ్మ ఇంటికి వెళ్లింది. సోమవారం తల్లిదండ్రులతో కలిసి హాస్టల్‌కు తిరిగివచ్చిoది. అయితే హాస్టల్లో ఉండేందుకు బాలిక ఇష్టపడలేదు. తల్లిదండ్రులు నిలదీయడంతో జరిగిన విషయం వివరించింది. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబసభ్యులు వంట మనిషిని నిలదీశారు. భయపడిన ఆమె వారి నుంచి తప్పించుకుని పారిపోయింది. దీనిపై ఆందోళనకు దిగిన తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు. 

ఘటనపై జిల్లా సంక్షేమ శాఖ అధికారి నాగైలేశ్వర్‌ మంగళవారం హాస్టల్‌లో విచారణ జరిపారు. కలెక్టర్‌కు నివేదిక ఇస్తానని, వంట మనిషిని ఉద్యోగం నుంచి తొలగిస్తామని, హాస్టల్‌ ఇన్‌చార్జి వార్డెన్, డెప్యుటేషన్‌పై పనిచేస్తున్న వాచ్‌మెన్‌ను బదిలీ చేస్తామని చెప్పారు. ఈ సంఘటన సంచలనం సృష్టించడంతో మిగతా విద్యార్థినుల తల్లిదండ్రులు భారీగా తరలివచ్చి అ«ధికారులు, సిబ్బందిని నిలదీశారు. 

పోలీసుల అదుపులో యువకుడు? 
బాలికను ఫొటోలు తీసిన మంథనికి చెందిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఫొటోలు తీసే సమయంలో సదరు యువకుడికి మరో వ్యక్తి వీడియో కాల్‌ చేశాడని, అప్పుడు బాలికను ఫొటోలు తీసిన యువకుడు ఆ వ్యక్తికి చూపించాడని తెలుస్తోంది. 

పోలీసులు దీనిపై దర్యాప్తు కొనసాగిస్తుండగా, బాలికను వంట మనిషి అసలెందుకు తీసుకువచ్చిoది? ఫొటోలు ఎందుకు తీశారు? క్షుద్ర పూజల కోసమా? సెక్స్‌ రాకెట్‌ నడుస్తోందా? అనే చర్చ జరుగుతోంది. సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

#

Tags : 1

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)