Breaking News

లే నాన్నా.. అమ్మ, తమ్ముడు వచ్చాం

Published on Tue, 06/10/2025 - 12:26

జయశంకర్: నాన్న లే ఒకసారి.. అమ్మ, తమ్ముడు వచ్చాం అంటూ.. తండ్రి మృతదేహన్ని చూసి కూతురు విలవిల్లాడింది.  రేపాకలో ట్రాక్టర్‌తో సçహబావిలో పడి చనిపోయిన యువరైతు బోయిని తిరుపతి రాజ్‌ (30) మృతదేహం వద్ద అతడి కుమార్తె విలపించిన తీరు చూపరులను కంటతడి పెట్టించింది. పోలీసుల కథనం ప్రకారం.. 

జయశంకర్‌ భూ పాలపల్లి జిల్లా రేగొండ మండలం రేపాక గ్రామానికి చెందిన బోయిని తిరుపతి రాజ్‌ తన వ్యవసాయ భూమిలో రోటవేటర్‌తో దున్నేందుకు ఉద యం ట్రాక్టర్‌పై వెళ్లాడు. దున్నే క్రమంలో ట్రాక్టర్‌ రివర్స్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు సమీపంలోని వ్యవసాయ బావిలో పడ్డాడు. బావిలో నీరు లేకపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. 

గ్రామస్తుల సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. తిరుపతి రాజ్‌ మృతదేహం మీద పడి భార్య, కూతురు, కుమారుడు గుండెలవిసేలా రోదించారు. నాన్న లే .. నాన్న లే అంటూ దిక్కులు పిక్కటిలేలా కూతురు, కుమారుడు విలపించారు. ఈ ఘటనపై మృతుడి తండ్రి బోయిని రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సందీప్‌కుమార్‌ తెలిపారు. మృతుడికి భార్య సంధ్య, కూతురు, కొడుకు ఉన్నారు.

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)