Breaking News

వివాహేతర సంబంధం: చెట్టుకు కట్టేసి.. రాళ్లతో కొట్టి హత్య

Published on Sun, 06/22/2025 - 07:50

నల్గొండ: తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో మహిళ భర్త, ఆయన కుటుంబ సభ్యులు ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. దీంతో ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌ మండలం నోముల గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నోముల గ్రామానికి చెందిన నర్సింగ్‌ జానయ్య(35)కు ఇంకా వివాహం కాలేదు. జానయ్యకు అదే గ్రామానికి చెందిన ఓ వివాహిత మహిళతో పరిచయం ఏర్పడి.. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. 

గతేడాది ఇదే విషయమై ఆ మహిళ కుటుంబ సభ్యులకు, జానయ్యకు మధ్య గొడవలు జరిగాయి. పలుమార్లు పెద్దమనుషుల మధ్య పంచాయితీలు కూడా నడిచాయి. ఇదే విషయంపై జానయ్యపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టడంతో అతడు జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుంచి వచ్చాక కూడా జానయ్య ఆమెతో సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసి జానయ్యను అంతమొందించాలని ఆ మహిళ భర్త నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో తన భార్యతోనే జానయ్యను శుక్రవారం మధ్యాహ్నం ఇంటికి పిలిపించాడు. ఇంటికి వచ్చిన జానయ్య కళ్లలో కారం చల్లి.. కాళ్లు, చేతులు కట్టేసి ఆ మహిళతోపాటు ఆమె భర్త కర్రలతో చితకబాదారు. 

అనంతరం మరికొందరితో కలసి ఇంటి పక్కన ఉన్న వీధిలో చెట్టుకు జానయ్యను తాళ్లతో కట్టేసి అతడి తల, కాళ్లు, చేతులు, మర్మాంగాలపై విచక్షణారహితంగా కొట్టారు. దీంతో తీవ్రంగా గాయపడిన జానయ్య అసస్మారకస్థితిలోకి వెళ్లాడు. చుట్టుపక్కల వారు గమనించి జానయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు వచ్చి జానయ్యను నకిరేకల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతిచెందాడు. ఈ ఘటనపై జానయ్య తల్లి శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాజశేఖర్‌ తెలిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)