Breaking News

నా చావుకు భార్య, అత్తమామలే కారణం..!

Published on Wed, 03/19/2025 - 13:36

నిర్మల్: ‘నా చావుకు భార్య, అత్తమామలే కారణం.. నా బిడ్డను మా అమ్మకు అప్పగించండి..’ అంటూ ఓ యువకుడు సెల్ఫీ వీడియోలో పేర్కొంటూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని వెల్గనూర్‌ గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కాండ్రపు అంజన్న(26) కాసిపేటకు చెందిన శిరీషను రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి వారం రోజుల క్రితం కూతురు జన్మించింది. 

దీంతో సోమవారం కూతురిని చూడడానికి అంజన్న కాసిపేటకు వెళ్లగా.. భార్య, అత్తమామలు దూషించారు. దీంతో ఆవేదనకు గురైన అంజన్న ఇంటికి వచ్చి సెల్ఫీ వీడియో తీసుకుంటూ తన ఆత్మహత్యకు కారకులు అంటూ భార్య, అత్తమామలు, పెద్దమనుషులు పలువురి పేర్లు పేర్కొన్నాడు. రాత్రి ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి భీమయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వెల్లడించారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)