Breaking News

తాతను చూసేందుకు వచ్చి..

Published on Wed, 07/02/2025 - 13:00

బషీరాబాద్‌: తాతను చూసేందుకు నగరం నుంచి వచ్చిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి ఇందర్‌చెడ్‌ సమీపంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శంకర్, మృతుడి బంధువులు తెలిపిన ప్రకారం.. మూడు రోజుల క్రితం మండల కేంద్రంలోని జయంతి కాలనీలో నివాసం ఉండే సంకుల బోనప్పను చూసేందుకు తన మనవడు బైలుపాటి రాము(25) హైదరాబాద్‌ నుంచి వచ్చాడు.

మంగళవారం చేపలు తీసుకువచ్చేందుకు తాతామనుమడు కలిసి బైక్‌పై ఇందర్‌చెడ్‌ సమీపంలోని చెరువుకు వెళ్లారు. చేపలు విక్రయించే వారు లేక వెనుదిరిగారు. ఈ క్రమంలో ఇందర్‌చెడ్‌– బషీరాబాద్‌ మార్గంలో మూలమలుపు వద్ద బైక్‌ అదుపుతప్పి రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో రాము తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. బోనప్ప గాయాలతో పడి ఉండడంతో గమనించిన వాహనదారులు వారి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. 

వెంటనే వారు అక్కడకు చేరుకుని తాండూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలంలో వివరాలు సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా తల్లిదండ్రులు లేని మృతుడికి భార్య మంగమ్మ గర్భిణి, మూడేళ్ల కూతురు ఉంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)