Breaking News

భార్య వివాహేతర సంబంధం.. మనస్తాపంతో భర్త ఆత్మహత్య

Published on Tue, 06/09/2026 - 15:27

కరీంనగర్ జిల్లా :  ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్య మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సోమవారం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవిశ్రీరాంపూర్‌లో చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బండి రాజు(35)కొమురంభీమ్‌ జిల్లా ఆసిఫాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ మహిను ప్రేమించి 8 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. 

వీరికి ఇద్దరు ఆడపిల్లలు జన్మనించారు. అదేగ్రామానికి చెందిన మండల రవీందర్‌తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది సరైన పద్ధతి కాదని రాజు తన భార్యతోపాటు రవీందర్‌నూ పలుమార్లు మందలించినా తీరు మారలేదు. ఈక్రమంలో ఆర్నెల్లక్రితం తన ఇద్దరు పిల్లలను తీసుకుని తన స్వస్థలం వెళ్లిపోయింది. పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టించినా, మందలించినా రవీందర్‌ తీరు మారకపోగా.. తన భార్యను తరచూ కలుసుకోవడంతో అవమానంగా భావించి మనస్తాపంతో రాజు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

 ఆగ్రహించిన మృతుడి కుటుంబ సభ్యులు ఇందుకు కారణమని భావించి రవీందర్‌ ఇందిఎదుట మృతదేహతో ధర్నా చేశారు. ఆత్మహత్యకు కారణమైన మృతుడి భార్యతోపాటు రవీంరద్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సమాచారం అందుకున్న మంథని సీఐ రాజు, ముత్తారం, రామగిరి ఎస్సైలు రవికుమార్, శ్రీనివాస్‌ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోలీస్‌స్టేషన్‌ వద్దకు తరలించారు. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.   

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)