Breaking News

టాలీవుడ్‌ నటికి కాబోయే భర్త ఆత్మహత్య

Published on Mon, 09/29/2025 - 07:20

బంజారాహిల్స్‌: నేను జీవితంలో చాలా తప్పులు చేశాను... ఇక మళ్లీ అలాంటి తప్పులు చేయను అంటూ సెల్ఫీ వీడియో పోస్ట్‌ చేసిన ఓ నటికి కాబోయే భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... రాజస్థాన్‌కు చెందిన సోహాని బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు పలు భాషల్లో సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల ఆమెకు రాజస్తాన్‌కు చెందిన సవాయ్‌ సింగ్‌ అనే యువకుడితో ఇన్‌స్టాలో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ఇద్దరి మధ్య ప్రేమకు దారి తీసింది. గత జూలైలో ఇద్దరు నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ ప్రశాసన్‌నగర్‌లోని ఓ ఫ్లాట్‌ను అద్దెకు తీసుకున్న సోహాని కుమారి అక్కడే ఉంటూ సినిమాల్లో నటిస్తోంది. 

శనివారం ఉదయం సవాయ్‌ సింగ్‌ ప్రశాసన్‌నగర్‌లోని ఆమె ఇంటికి వచ్చాడు. తర్వాత ఇద్దరూ కలిసి గచి్చ»ౌలిలోని ఎవరి కార్యాలయాలకు వారు వెళ్లి పోయారు. సాయంత్రం సోహాని ఇంటికి వచ్చి తాళం తీసి  లోపలికి వెళ్లి చూడగా డైనింగ్‌ హాల్‌లో సవాయ్‌ సింగ్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఆత్మహత్య చేసుకునే ముందు అతను సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు గుర్తించారు. 

సోహాని కుమారితో పరిచయానికి ముందు సవాయ్‌ సింగ్‌కు మరో యువతితో స్నేహం ఉండేదని ఆమెను మర్చిపోలేకపోవడం, ఆర్థిక సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సోహాని  పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు  సీసీ ఫుటేజీలు పరిశీలించగా శుక్రవారం ఉదయం 11.47 గంటలకు సవాయ్‌ సింగ్‌ ఆమె ఉంటున్న ఫ్లాట్‌ వెనుక డోర్‌ ద్వారా  ఇంట్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నట్లుగా నిర్ధారించారు.  కేసు నమోదు చేసుకునిని దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్‌ టీమ్‌ సహాయంతో ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు. ఆయన మాజీ స్నేహితురాలిని కూడా విచారిస్తున్నారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)