Breaking News

బంజారాహిల్స్‌లో మరో చరిత్ర..!

Published on Sun, 01/04/2026 - 09:54

హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన అమ్మాయి(16), అబ్బాయి(16) ఇద్దరూ పదో తరగతి వరకు ఒక్కటే పాఠశాలలో చదువుకుంటుండగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఏడాది క్రితం వరకూ ఇద్దరూ ప్రేమ పక్షుల్లా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుండటంతో అమ్మాయి, అబ్బాయి కుటుంబీకులకు తెలిసి మందలించి ఒకనొకరు కలుసుకోకుండా షరతులు విధించారు. సినీ ఫక్కీలో గత మరో చరిత్ర సినిమాను తలపించేలా అమ్మాయిని, అబ్బాయిని విడదీసి మేజర్లు అయ్యేవరకు కలుసుకోవద్దని చెప్పారు.

 దీంతో సదరు అబ్బాయి పాల్వంచలోనే ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతుండగా, అమ్మాయి హైదరాబాద్‌కు వచ్చి బంజారాహిల్స్‌ రోడ్డునెంబర్‌–12లోని ఎన్‌బీటీనగర్‌ బస్తీలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఇక్కడే కుట్టు శిక్షణ తీసుకుంటున్నది. ఈ నెల 31వ తేదీన సదరు అబ్బాయి హైదరాబాద్‌కు వచ్చి ఎన్‌బీటీనగర్‌లోని అమ్మాయి ఇంటికి వెళ్లి అక్కడే నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నాడు. ఈ విషయం గత నెల 31న రాత్రి 8 గంటల ప్రాంతంలో అబ్బాయి కనిపించకపోవడంతో అనుమానం వచ్చి హైదరాబాద్‌కు పరుగులు తీశారు. ఎన్‌బీటీనగర్‌లోని అమ్మాయి ఇంటికి వచ్చి చూడగా ఇద్దరూ ఒకే గదిలో కనిపించారు. 

దీంతో అమ్మాయి తల్లిదండ్రులు బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సదరు బాలుడు మైనర్‌ కావడంతో జువైనల్‌ హోమ్‌కు తరలించారు. అమ్మాయిని ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. 16 ఏళ్ల వయస్సులో ఈ ఇద్దరు మైనర్లు మరో చరిత్ర సినిమాను తలపించేలా ప్రేమించుకోవడం, తల్లిదండ్రులు విడగొట్టడం, మళ్లీ కలుసుకోవడం, వ్యవహారం పోలీసుల దాకా రావడం పోలీసులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)