యంగ్‌ ఇండియాకు 25 ఎకరాలు ఉండాల్సిందే

Published on Mon, 07/28/2025 - 04:52

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: యంగ్‌ ఇండియా ఇంటి­గ్రేటెడ్‌ స్కూళ్ల నిర్మాణానికి 25 ఎకరాలకు తగ్గకుండా స్థలాన్ని సేకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. 2,600 మంది పిల్లలు ఉండే క్యాంపస్‌లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుందని, 25 ఎకరాలకు పైగానే స్థలాన్ని తీసుకునేందుకు ప్రయత్నించాలన్నారు. కొత్త­గూడెంలో ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ పథ­కాల అమలు, అభివృద్ధి పనులపై జరిగిన సమీక్షలో భట్టి మా­ట్లా­డారు. 

హరితహారం పేరుతో విరివిగా మొక్కలు నాటా­మ­ని గత ప్రభుత్వం చెప్పుకుందని, ఉమ్మడి జిల్లాలో ఏదైనా ఒక మే­జర్‌ పంచాయతీని యూనిట్‌గా తీసుకొని గడిచిన పదేళ్లలో అక్కడ నాటిన మొక్కలు ఎన్ని? చేసిన ఖర్చు ఎంత? ఇప్పటి­వరకు బతికి ఉన్న మొక్కలు ఎన్ని అనే కచ్చితమైన వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు. ఈ పైలెట్‌ ప్రాజెక్టు ద్వారా వచ్చే ఫలితాలను అనుసరించి రాబోయే రోజుల్లో వనమహోత్సవం కార్యక్రమాన్ని లోపరహితంగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. 

మహిళా సంఘాలకు చేపపిల్లల బాధ్యత..
మత్స్యకారులకు ప్రభుత్వం ఉచితంగా అందజేసే చేపపిల్లల పెంపకం బాధ్యతలను మహిళా సంఘాలకు అప్పగించే యోచనలో ఉన్నట్టు మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు.గతంలో నిర్మించిన, మధ్యలో ఆగిపోయిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల వివరాలను గ్రామాల వారీగా సేకరించాలని, వీటిని ఆగస్టు 15లోగా పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ వానాకాలంలో వరద ముప్పు ఎదుర్కొనేందుకు ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.  

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)