Breaking News

సైనిక్‌ స్కూల్‌ తరహాలో యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌

Published on Sun, 03/02/2025 - 02:44

సాక్షి, హైదరాబాద్‌: సైనిక్‌ స్కూళ్ల తరహాలో యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ను కూడా దేశానికి రోల్‌ మోడల్‌గా తీర్చిదిద్దాలని అధికారులకు ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి సూచించారు. విద్యా విధానంలో కొత్త ఒరవడిని అవలంబించాలని, క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో పోలీస్, యూనిఫామ్‌ సర్వీస్‌ ఉద్యోగుల పిల్లల కోసం యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ నెలకొల్పాలని నిర్ణయించిన విషయం తెలిసిందే.

శనివారం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ స్కూల్‌ బ్రోచర్, వెబ్‌సైట్‌ను సీఎం ఆవిష్కరించారు. స్కూల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్టు ప్రకటించారు. స్కూల్‌ యూనిఫామ్‌ నమూనాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పోలీస్‌ అమరుల కుటుంబాల పిల్లలకు అడ్మిషన్లలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

కార్యక్రమంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శి శ్రీధర్, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్, అడిషనల్‌ డీజీ (ఆపరేషన్స్‌) స్టీఫెన్‌ రవీంద్ర, ఐజీ రమేశ్, ఉమెన్స్‌ సేఫ్టీ వింగ్‌ డీఐజీ రెమా రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.  

31న యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ ప్రారంభం 
యంగ్‌ ఇండియా పోలీస్‌ స్కూల్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఈ నెల 31న ప్రారంభించనున్నారు. ఈ స్కూల్‌లో 50 శాతం సీట్లు యూనిఫామ్‌ సర్వీస్‌ ఉద్యోగుల పిల్లలకు రిజర్వ్‌ చేశారు. మిగిలిన 50 శాతం సాధారణ పౌరుల పిల్లలకు ఇస్తారు. సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ నేతృత్వంలోని అధికారుల బృందం గత రెండు నెలలుగా ఈ పాఠశాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసింది. అవసరమైన అనుమతులు, సిబ్బంది నియామకం, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తి చేశారు.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)