Breaking News

ఫోన్‌లో యువకుడితో మాట్లాడుతోందని..

Published on Tue, 07/29/2025 - 07:34

హైదరాబాద్‌: సెల్‌ఫోన్‌లో మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆవేశానికి లోనైన ఓ తమ్ముడు అక్క గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం పెంజర్లలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాఘవేంద్ర, సునీత దంపతులకు రుచిత (21), రోహిత్‌ (20) వైష్ణవి (18) సంతానం. పెద్ద కూతురు రుచిత ఇటీవలే డిగ్రీ పూర్తి చేసి, ఎంబీఏలో చేరేందుకు సిద్ధమవుతోంది. 

రుచిత ఇదే గ్రామానికి చెందిన దినేశ్‌ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయంలో పలుమార్లు ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగ్గా, ఒకరితో ఒకరు మాట్లాడకూడదని తీర్మానించుకున్నారు. తల్లిదండ్రులు పని నిమిత్తం ఉదయాన్నే బయటకు వెళ్లగా.. ఉదయం 11 గంటలకు తమ్ముడు రోహిత్‌ ఇంటికి వచ్చాడు. ఈ సమయంలో రుచిత ఫోన్‌లో దినేశ్‌తో మాట్లాడటాన్ని గమనించి అక్కతో వాగ్వాదానికి దిగాడు.

ఇరువురి మధ్య మాటామాటా పెరిగి, ఆగ్రహానికి గురైన రోహిత్‌ గొంతు నులిమి సోదరిని హత్య చేశాడు. అనంతరం కొడిచర్లలో ఉన్న బంధువులకు ఫోన్‌ చేసి, అక్కకు శ్వాస ఆడటం లేదని, కిందపడిపోయిందని చెప్పాడు. వారు వచ్చి పరిశీలించగా అప్పటికే రుచిత చనిపోయింది. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు దినేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని షాద్‌నగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. దినేశ్‌ కారణంగానే తన కూతురు చనిపోయిందని, మృతురాలి తండ్రి రాఘవేంద్ర ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని సీఐ నర్సింహారావు తెలిపారు. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)