Breaking News

నా చావుకు.. నా భార్యే కారణం..

Published on Thu, 06/12/2025 - 11:30

సంగారెడ్డి క్రైమ్‌: భార్య వేధింపులు తట్టుకోలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేష్‌ వివరాల ప్రకారం..పుల్‌కల్‌ మండలానికి చెందిన కప్పరితల మల్లేశం, లక్ష్మమ్మ దంపతుల రెండో కుమారుడు నవీన్‌ కుమార్‌(29), తోషిబా కంపెనీలో పని చేస్తున్నాడు. మూడేళ్ల క్రితం దుద్దేల గ్రామం వట్‌పల్లి మండలానికి చెందిన స్వరూప రాణితో వివాహం జరిగింది. 

తర్వాత దంపతులు సంగారెడ్డి పట్టణంలోని గణేశ్‌ నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు లేరు. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో పలుసార్లు పంచాయితీ పెట్టి దంపతులకు నచ్చజెప్పారు. ఇటీవల మళ్లీ దంపతుల మధ్య గొడవలు జరగడంతో ఈ నెల 6న స్వరూప రాణి పుట్టింటికి వెళ్లింది. తర్వాత ఆమె పలుమార్లు నవీన్‌కు ఫోన్‌ చేస్తే ఎత్తలేదు. దీంతో 10వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో మామకు ఫోన్‌లో సమాచారం అందించింది.

 వెంటనే కుటుంబ సభ్యులు నవీన్‌ రూమ్‌కు వెళ్లారు. తలుపులు తీయకపోవడంతో పగులగొట్టి చూడగా గదిలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఉన్నాడు. వెంటనే సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు నిర్ధారించి మృతి చెందినట్లు తెలిపారు. సూసైడ్‌ నోట్‌లో తన మరణానికి కారణం భార్య మానసిక వేధింపులు, ఆమె చేసిన అప్పులే కారణం అని రాశాడు. పోలీసులు సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తండ్రి మల్లేశం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)