Breaking News

యాదాద్రి రాజగోపురానికి బంగారు తాపడం

Published on Wed, 09/25/2024 - 04:41

సాక్షి, యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ రాజగోపురం బంగారు తాపడం పనులకు మోక్షం కలగనుంది. సుమారు 60 కేజీల బంగారంతో తాపడం పనులను చేపట్టనున్నారు. వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి బంగారు తాపడం పనులు పూర్తి చేయాలని సంకల్పించారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, దేవాదాయ శాఖమంత్రి కొండా సురేఖ, ఉన్నతస్థాయి అధికారులు జరిపిన సమీక్షా సమావేశాల్లో యాదాద్రి ఆలయ రాజగోపురానికి బంగారు తాపడంపై చర్చించిన విషయం తెలిసిందే. 

బంగారు తాపడం పనులను దాతలు ఇచ్చిన విరాళాలు, దేవస్థానం నిధులతో చేయనున్నారు. ఇప్పటికే దాతలు ఇచ్చిన నగదు సుమారు రూ.25 కోట్లు నగదు, 11 కిలోల బంగారం దేవస్థానం వద్ద ఉంది. దేవస్థానం హుండీలో భక్తులు సమర్పించిన బంగారం, వెండిని మింట్‌కు పంపించి ప్యూర్‌ గోల్డ్‌ (24 క్యారెట్లు)గా మార్చనున్నారు.

అయితే భక్తులు సమర్పించిన మిశ్రమ బంగారాన్ని ప్యూర్‌ గోల్డ్‌గా మార్చడం, వెండి ఆభరణాలను కరిగించి అందుకు సమానమైన సుమారు 25 కిలోల బంగారాన్ని మింట్‌ ద్వారా తీసుకోనున్నారు. రాజగోపురానికి 10,500 చదరపు అడుగుల మేరకు బంగారు తాపడం పనులకు అంచనా వేశారు. పనులు చేయడానికి రూ.6 కోట్లు మేకింగ్‌ చార్జీలు అవసరం అవుతాయని అంచనా వేశారు. గ్లోబల్‌ టెండర్ల ద్వారా బంగారు తాపడం తయారు పనులను అప్పగించనున్నారు.  

సీఎం ఆమోదం పొందగానే పనులు: ఆలయ ఈవో భాస్కర్‌రావు  
బంగారు తాపడం పనుల ఆమోదం ఫైలు సీఎంవోలో ఉంది. దేవాదాయ శాఖ నుంచి సీఎంకు ఫైల్‌ పంపించారు. సీఎం ఆమోదం లభించగానే పనులు ప్రారంభిస్తాం. స్వర్ణ తాపడం పనుల కోసం అవసరమైన ఖర్చును దేవస్థానం భరిస్తుంది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)