Breaking News

బామ్మర్ది పెళ్లి.. బావ బలవన్మరణం

Published on Fri, 03/13/2026 - 13:25

యాదాద్రి భువనగిరి జిల్లా: మరికాసేపట్లో బామ్మర్ది పెళ్లి జరగాల్సి ఉండగా.. కుటుంబ సమస్యలతో ఉరేసుకుని బావ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆలేరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. గురువారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆలేరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పోచమ్మగుడి ప్రాంతానికి చెందిన చిన్నం రమేష్‌(32) టోయింగ్‌ వెహికిల్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

 అతడికి భార్య ఉమారాణి, ఇద్దరు కుమారులు ఉన్నారు. రమేష్‌ కొంతకాలంగా కుటుంబ సమస్యలతో బాధపడుతున్నాడు. అంతేకాకుండా ఇటీవల అతడి తల్లి మృతిచెందడంతో మానసికంగా మరింత కుంగిపోయాడు. గురువారం రమేష్‌ సొంత బామ్మర్ది వివాహం జరగాల్సి ఉండగా.. బుధవారం చిన్నరామచర్ల గ్రామంలో జరిగిన హాల్ది వేడుకల్లో పాల్గొన్నాడు. 

అనంతరం రాత్రి కారులో రమేష్‌ ఆలేరులోని తన ఇంటికి తిరిగి వచ్చాడు. గురువారం ఉదయం భార్య, కుటుంబ సభ్యులు ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా రమేష్‌ స్పందించలేదు. దీంతో పక్కింటి వారికి చెప్పడంతో వారు వెళ్లి చూడగా.. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని రమేష్‌ కనిపించాడు. మృతుడి సోదరి చిన్నం స్వప్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వినయ్‌ తెలిపారు. ఇదిలా ఉండగా రమేష్‌ ఆత్మహత్యతో గురువారం జరగాలి్సన అతడి బావమర్ది పెళ్లి నిలిచిపోయింది.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)