Breaking News

చావు పిలిచింది.. వెళ్లిపోతున్నా..

Published on Sat, 09/20/2025 - 07:20

యాదాద్రి భువనగిరి జిల్లా: ‘తనను పది రోజులుగా చావు పిలుస్తుంది.. నేను చావు వద్దకు వెళ్లిపోతున్న.. ఇందులో ఎవరి ప్రమేయం లేదు’అంటూ ఓ యువకుడు చెరువులో దూకాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌ మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. బంధువులు, పోలీసులు, యువకుడి వాయిస్‌ రికార్డులో నమోదైన వివరాల ప్రకారం...హనుమకొండ జిల్లా రాంనగర్‌కు చెందిన బర్ల సురేందర్‌ (36) ఉప్పల్‌ సమీపంలోని రామాంతపూర్‌లో డీమార్ట్‌ వెనుకాల తన భార్య, కొడుకుతో నివాసం ఉంటున్నాడు. సురేందర్‌ హైటెక్‌ సిటీలోని ఓప్రైవేట్‌ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. పది రోజులుగా సురేందర్‌ మానసిక స్థితి బాగాలేకపోవడంతో ఏదేదో మాట్లాడుతుండేవాడు. 

నిత్యం చావు కల వస్తుందని, తన వద్దకు రమ్మని చావు పిలుస్తుందని, దేవుళ్లు పిలుస్తున్నట్టు పీడ కలలు వస్తున్నాయని, తాను చనిపోతానని కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులకు చెబుతుండేవాడు. కాగా కుటుంబసభ్యులు అతని పలు దేవాలయాలు, దైవదర్శనాలకు తిప్పారు. మానసిక పరిస్థితి మెరుగుపడటంతో ఉద్యోగానికి వెళ్లానని కుటుంబ సభ్యులు చెప్పడంతో ఒప్పుకున్నాడు. నాలుగు రోజులుగా ఉద్యోగానికి వెళ్తున్న సురేందర్‌.. శుక్రవారం ఉదయం కూడా డ్యూటీకి వెళుతున్నట్టు ఇంట్లో చెప్పాడు. క్యాబ్‌ బుక్‌ చేసుకొని బీబీనగర్‌ పెద్ద చెరువు వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి తన కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేశాడు. 

చావు రమ్మటుంది.. నేను వెళ్తున్నానని, చెరువులో దూకి చనిపోతున్నానని, తన చావు కార్యక్రమాలు పాత ఇంట్లో చేయాలని, నా చావుకు ఎవరూ కారణం కాదని సెల్‌ఫోన్‌లో వాయిస్‌ రికార్డ్‌ చేసి పంపాడు. ఆ తర్వాత బూట్లు, సెల్‌ఫోన్‌ చెరువు కట్టపై పెట్టి చెరువులో దూకాడు. బంధువుల సమాచారంతో పోలీసులు, రెస్క్యూ టీం చెరువులో గాలింపు చర్యలు చేపట్టినా ఆచూకీ దొరకకపోవడంతో అక్కడే ఉన్న సురేందర్‌ భార్య.. భర్త లేనిదే తాను ఉండలేనంటూ చెరువులో దూకింది. అప్రమత్తమైన రెస్క్యూ టీం ఆమెను కాపాడింది. శుక్రవారం రాత్రి వరకు గాలించినా సురేందర్‌ ఆచూకీ లభించకపోవడంతో శనివారం కూడా గాలింపు చర్యలు చేపట్టే అవకాశముంది. 

#

Tags : 1

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)