Breaking News

హైదరాబాద్‌లో సీ4ఐఆర్‌ సెంటర్‌

Published on Tue, 01/17/2023 - 01:26

సాక్షి, హైదరాబాద్‌: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో సోమవారం ప్రారంభమైన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సమావేశం తొలిరోజే తెలంగాణ ప్రభుత్వం కీలక విజయం సాధించింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థల కార్యకలాపాలకు కేంద్రంగా మారిన హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ అడుగు పెడుతోంది. సీ4ఐఆర్‌ (సెంటర్‌ ఫర్‌ ఫోర్త్‌ ఇండస్ట్రియల్‌ రెవల్యూషన్‌)కు చెందిన సెంటర్‌ను హైదరాబాద్‌లో  ఏర్పాటు చేసేందుకు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది.

ఈ ఒప్పందంపై వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జెరేమీ జర్గన్స్, తెలంగాణ ప్రభుత్వ లైఫ్‌ సెన్సెస్‌ ఫౌండేషన్‌ సీఈవో శక్తి నాగప్పన్‌ సంతకాలు చేశారు. ఐటీ, పరిశ్రమల మంత్రి కె.తారక రామారావు, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేశ్‌ రంజన్, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ అధ్యక్షుడు బోర్జ్‌ బ్రెందే తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జీవశాస్త్రాలు (లైఫ్‌ సైన్సెస్‌), ఆరోగ్య సంరక్షణ అంశాలపై ఈ కేంద్రం అధ్యయనం చేస్తుంది. భారత్‌లో సీ4ఐఆర్‌ విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్‌ దేశాల్లో ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి. 

తెలంగాణ అనుకూలతలు, సత్తాకు నిదర్శనం: కేటీఆర్‌
లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అనుకూలతలు, సత్తాకు సీ4ఐఆర్‌ కేంద్రం ఏర్పాటు నిదర్శనమని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఒప్పంద కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, లైఫ్‌ సైన్సెస్‌ రంగం అభివృద్ధికోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలతోనే ఈ సెంటర్‌ ఏర్పాటు సాధ్యమైందన్నారు. లైఫ్‌ సైన్సెస్, హెల్త్‌ కేర్‌ రంగంలో ఉన్న అవకాశాలను భారత్‌ అందిపుచ్చుకునేందుకు ఈ కేంద్రం దోహదం చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉద్యోగ, ఉపాధి కల్పనలో హైదరాబాద్‌ సీ4ఐఆర్‌ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ప్రెసిడెంట్‌ బోర్జ్‌ బ్రెందే అన్నారు. సీ4ఐఆర్‌ ద్వారా ఆరోగ్య సంరక్షణలో ఇండియాను గ్లోబల్‌ పవర్‌హౌస్‌గా మార్చేందుకు తెలంగాణ నాయకత్వం వహిస్తుందని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం హెల్త్‌ కేర్‌ హెడ్‌ డాక్టర్‌ శ్యామ్‌ బిషెన్‌ పేర్కొన్నారు. ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగంలో వినూత్న మార్పులు, రోగుల సౌకర్యాలను మెరుగు పరచడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. 

Videos

అసలు గేమ్ ఇదేనా..? అడ్డంగా దొరికిపోయింది.. ఇక నందన చాప్టర్ క్లోజ్!

AlphaGeo: డేంజర్ జోన్ లో హైదరాబాద్.. ప్రకృతి వార్నింగ్

YS జగన్ పాదయాత్ర డేట్ ఫిక్స్

వివేకా కేసులో వీడిన మిస్టరీ...? కారుమూరి సంచలన వ్యాఖ్యలు

తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. పోలీసులకు సాదిక్ ఖాన్ సమాధానాలు?

Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?

2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

మజ్జి శ్రీనివాసరావు TDPలో చేరికపై కొండ రాజీవ్ స్ట్రాంగ్ రియాక్షన్

యూకేలో అల్లకల్లోలం.. వెయ్యికి పైగా విమానాలు రద్దు..

అక్క స్కెచ్ అదిరిందిగా! బిగ్ బాస్ లోకి రమానందన వైల్డ్ కార్డ్ ఎంట్రీ?

Photos

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)