Breaking News

తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలు భేష్‌

Published on Sun, 09/22/2024 - 05:59

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ప్రభుత్వ ప్రాధాన్యతలు బాగున్నాయని ప్రపంచ బ్యాంకు ప్రతినిధి బృందం ప్రశంసించింది. గత నెలలో వాషింగ్టన్‌లో ప్రపంచబ్యాంక్‌ అధ్యక్షుడు అజయ్‌ బంగాతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భేటీ అయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తదుపరి చర్చల కోసం ప్రపంచబ్యాంకు దక్షిణాసియా ప్రాంత ఉపాధ్యక్షుడు మార్టీన్‌ రైజర్‌ నేతృత్వంలో వరల్డ్‌ బ్యాంక్‌ కంట్రీ ఆపరేషన్‌ హెడ్‌ పాల్‌ ప్రోసీ, అర్బన్‌ ఇన్‌ఫ్రా, ప్రాజెక్ట్‌ లీడ్‌ నటాలియా కె, డిజిటల్‌ డెవలప్‌మెంట్‌ సీనియర్‌ స్పెషలిస్ట్‌ మహిమాపత్‌ రే శనివారం హైదరాబాద్‌ వచ్చారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రితో వారు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా, వైద్య, సాగునీటి రంగాలను తమ ప్రభుత్వ ప్రాధాన్యాలుగా పెట్టుకున్నామని, ఆయా రంగాల్లో తాము తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వారికి వివరించారు. తాము ప్రాధాన్యంగా తీసుకుంటున్న ప్రాజెక్టులకు ఆర్థిక సహకారంతో పాటు అత్యుత్తమ ప్రమాణాలతో తెలంగాణ ప్రాజెక్టులు నిలిచేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు. విద్యా, వైద్య రంగాల్లో రేవంత్‌రెడ్డి దార్శనికత బాగుందని, భవిష్యత్‌ అవసరాలకు అనుగుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని మార్టీన్‌ రైజర్‌ ప్రశంసించారు.

 ప్రపంచ బ్యాంకు ఏ రంగాలను ప్రాధాన్య అంశాలుగా ఎంచుకుందో అవే తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్య అంశాలుగా ఉన్నాయని మార్టిన్‌ రైజర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి సహకరించేందుకు తాము ఆసక్తిగా ఉన్నామని ఆయన తెలిపారు. సమావేశంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పాల్గొన్నారు.

‘ఏటీసీల్లో సిబ్బంది కొరతను అధిగమించాలి’
రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లలో సిబ్బంది కొరతను అధిగమించాలని సీఎం ఎ.రేవంత్‌ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాల యంలో కార్మిక, ఉపాధి కల్పన శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తున్న నేపథ్యంలో సిబ్బంది కొరత లేకుండా చూడాలని స్పష్టం చేశారు.

ప్రస్తుత ఇండస్ట్రీ అవసరాలకనుగుణంగా సిలబస్‌ను అప్‌గ్రేడ్‌ చేయాలని, మార్కెట్‌ అవసరాలకనుగుణంగా ఏటీసీల్లో సిలబస్‌ ఉండాలని, ఈ మేరకు సిలబస్‌ మార్పునకు ప్రత్యేకంగా ఒక కమిటీని నియమించి నిపుణుల సలహాలు, సూచనలు స్వీకరించాలని ఆదేశించారు. వృత్తి నైపుణ్యం అందించే ఏటీసీలను, పాలిటెక్నిక్‌ కాలేజీలను యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకొచ్చేలా విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు. సమావేశంలో సీ.ఎస్‌ శాంతికుమారి, కారి్మక శాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్‌ కుమార్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.  

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు