Breaking News

మొబైల్‌ మహారాణులు

Published on Thu, 06/05/2025 - 01:48

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రం స్మార్ట్‌గా దూసుకెళుతోంది. మొబైల్‌ ఫోన్, ఇంటర్నెట్‌ వినియోగం దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలోనే ఎక్కువగా ఉందని కాంప్రహెన్సివ్‌ మాడ్యులార్‌ సర్వే– టెలికం 2025లో వెల్లడైంది. కేంద్ర గణాంక, కార్యక్రమాల అమలు శాఖ ఈ ఏడాదే ఈ సర్వే నిర్వహించింది. 

ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు, యూపీఐల ద్వారా నగదు చెల్లింపులు తెలంగాణలోనే ఎక్కువగా జరుగుతున్నాయని సర్వేలో తేలింది. మరో ఆసక్తికర విషయం ఏమిటంటే రాష్ట్రంలో పురుషులకంటే మహిళలే మొబైల్‌ ఫోన్లు ఎక్కువగా వాడుతున్నారు. సొంతంగా మొబైల్‌ ఫోన్లు కలిగి ఉన్నవారిలో కూడా మహిళలే ముందుండటం విశేషం. సర్వేలోని ముఖ్యాంశాలు.. 

» ఈ ఏడాది జనవరి–మార్చి మధ్య కాలంలో సర్వే నిర్వహించారు. దేశవ్యాప్తంగా 2,395 గ్రామీణ, 1,987 పట్టణ ప్రాంతాల్లో 34,950 కుటుంబాల్లోని 1,42,065 మంది అభిప్రాయాలు తీసుకున్నారు.  
»    15–29 ఏళ్ల మధ్య వయసు్కల్లో 97.1 శాతం మంది సర్వే జరిపిన రోజు కంటే ముందు మూడు నెలల కాలంలో మొబైల్‌ ఫోన్‌ వినియోగించారు. ఇందులో 98 శాతం మంది పురుషులు, 96 శాతం మంది మహిళలు ఉన్నారు. 2022–23లో 96.4 శాతం మంది పురుషులు, 91.8 శాతం మంది మహిళలు మొబైల్‌ ఫోన్‌ వాడినట్టు వెల్లడైంది.  
»     తెలంగాణలో 98.3 శాతం మంది పురుషులు, 98.6 శాతం మంది మహిళలు మొబైల్‌ ఫోన్‌ వాడుతున్నారని తేలింది. రాష్ట్ర సగటు 98.4 శాతంగా నమోదైంది. మిజోరం, అండమాన్‌ నికోబార్, చండీగఢ్, లక్షద్వీప్‌లో 100 శాతం మంది మొబైళ్లు వాడుతున్నారు. అయితే, వాడుతున్న వారితో పోలిస్తే సొంతంగా మొబైల్‌ ఫోన్‌ ఉన్న వారి సంఖ్య తగ్గింది. తెలంగాణలో 87.7 శాతం మంది పురుషులు, 78.3 శాతం మంది మహిళలకు సొంతంగా ఫోన్లు ఉన్నాయని సర్వేలో వెల్లడైంది.  
»   దేశవ్యాప్తంగా 70 శాతం మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారు. తెలంగాణలో 72.2 శాతం మంది ఇంటర్నెట్‌ వాడుతున్నారు. ఇందులో 79.9 శాతం మంది పురుషులు, 64.9 శాతం మంది మహిళలు ఉన్నారు. ఇంటర్నెట్‌ వినియోగంలో దేశంలో చండీగఢ్‌ (94.6 శాతం), మిజోరం (92.7 శాతం)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి.  
»  తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 51.9%, పట్టణ ప్రాంతాల్లో 77.3 శాతం మంది ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలు జరుపుతున్నారని సర్వేలో వెల్లడైంది. అంటే సగటున 63.5 శాతం మంది ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ వాడుతున్నారు. ఇందులో దేశసగటు 48.9 మాత్రమే ఉంది.  
»  తెలంగాణలో 26.4% (18.9 శాతం మంది గ్రామీణ, 32.3 శాతం పట్టణ) మంది యూపీ ఐల ద్వారా నగదు చెల్లింపులుజరుపుతుండగా, దేశవ్యాప్తంగా ఇది18 శాతం ఉంది.

Videos

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

ఈ రోజు కరకట్టలో కూర్చొని ముసిముసి నవ్వులు నవ్వొచ్చు.. రేపు అనేది మీ ఊహకే వదిలేస్తున్నాం

మా కార్యకర్తలను చంపడానికా ఈ ఎలక్షన్ లు పెట్టారు.. SECని నిలదీసిన YSRCP నేతలు

టీడీపీ గూండాల దాడిపై వైఎస్ జగన్ ప్రెస్ మీట్

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)