Breaking News

అప్పు తిరిగి ఇవ్వ లేదని..

Published on Wed, 08/28/2024 - 08:15

కాచిగూడ: తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని ఓ మహిళ చిన్నారిని కిడ్నాప్‌ చేసిన సంఘటన కాచిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. అయితే 12గంటల్లో కేసును చేధించిన కాచిగూడ పోలీసులు చిన్నారిని క్షేమంగా కుటుంబీకులకు అప్పగించారు. కాచిగూడ పోలీస్‌స్టేషన్‌లో  మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూర్పు మండలం డీసీపీ బాలస్వామి, అడిషనల్‌ డీసీపీ జె.నర్సయ్య, ఏసీపీ రఘు, ఇన్‌స్పెక్టర్‌ చంద్రకుమార్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. 

 సోమవారం రాత్రి  కాచిగూడ రైల్వేస్టేషన్‌ ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్టాండ్‌ ఫుట్‌పాత్‌పై పార్వతమ్మ అనే యాచకురాలు తన మనవరాలు(1.5) శ్రీలక్షి్మతో కలిసి నిద్రించింది. మంగళవారం తెల్లవారుఝామున నిద్ర లేచి చూసేసరికి చిన్నారి కనిపించకపోవడంతో కాచిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.  సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఓ మహిళ చిన్నారిని తీసుకుని ఆటోలో  అఫ్జల్‌గంజ్‌ వైపు వెళుతున్నట్లు గుర్తించారు. 

దీంతో డబీర్‌పురా రైల్వే స్టేషన్‌ సమీపంలో సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా కిడ్నాప్‌ చేసింది తానేనని అంగీకరించింది. కామారెడ్డి జిల్లాకు చెందిన యాచకురాలు దాసరి మంజుల భిక్షాటన కోసం నగరానికి రాకపోకలు సాగించేదని, కిడ్నాప్‌నకు గురైన చిన్నారి శ్రీలక్ష్మి తల్లి మమత ఆమెవద్ద రూ.1500 అప్పు తీసుకుని తిరిగి ఇవ్వకపోవడంతోనే మంజుల పాపను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఇందుకు ఆమె మరిది మున్నాతో పాటు ఆమె ఇద్దరు బాలలు సహకరించినట్లు గుర్తించారు. చిన్నారిని ఆమె అమ్మమ్మకు అప్పగించిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)