Breaking News

యూరియా కోసం చెప్పులతో కొట్లాట

Published on Wed, 09/10/2025 - 04:35

గజ్వేల్‌రూరల్‌/గరిడేపల్లి/దుబ్బాక/బీబీపేట: ఎ­ప్పు­­డు వస్తుందో... ఎప్పుడు ఇస్తారో తెలియక యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతున్నా­రు. కొన్ని చోట్ల రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తుండగా, మరికొన్ని చోట్ల ఘర్షణలకు దిగుతున్నారు.  

» సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లోని వ్యవసాయ మార్కెట్‌ కార్యాలయ ఆవరణలో మంగళవారం యూరి­యా టోకెన్ల కోసం బారులు తీరిన మహిళా రైతు­లు ఒకరినొకరు చెప్పులతో కొట్టుకున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడున్న వారంతా ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు.  

» వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం ఇటుకాలపల్లిలోని జాతీయ రహదారిపై యూరియా కోసం రైతులు ధర్నా చేశారు. రాయపర్తి మండలం పెర్కవేడులో యూరియా కోసం టోకెన్లు ఇస్తున్నారని తెల్లవారుజాము నుంచే రైతువేదిక వద్ద మహిళా రైతులు బారులుతీరారు. 

» మహబూబాబాద్‌ జిల్లాలోని కురవి, మహబూబాబాద్‌ మండలాల్లో పీఏసీఎస్‌ కేంద్రాల వద్ద కూడా బారులుతీరారు. నర్సింహులపేట మండలంలోని పెద్దనాగారం స్టేజీ వద్ద వరంగల్‌–ఖమ్మం జాతీయ రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు.  

» కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి మంగళవారం యూరియా వస్తుందని తెలుసుకున్న రైతులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. అలసిపోయి, నీరసించిన తర్వాత రైతులు క్యూ లైన్లో రాళ్లు, చెప్పులు, చెట్ల కొమ్మలు పెట్టారు.  

» సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల కేంద్రంలోని మన గ్రోమోర్‌ సెంటర్‌కు రైతులు పెద్ద సంఖ్యలో వచ్చి క్యూలైన్లలో నిలబడ్డారు. కేవలం 15 నుంచి 20 మందికి మాత్రమే రెండు బస్తాలు ఇచ్చి స్టాక్‌ అయిపోయిందని చెప్పడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. 

#

Tags : 1

Videos

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)