Breaking News

‘ఎస్‌హెచ్‌జీ’ చేతికి స్టీరింగ్‌

Published on Wed, 02/26/2025 - 04:48

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లో ఇకపై స్వయం సహాయక సంఘాలు (ఎస్‌హెచ్‌జీ) క్యాబ్‌ సేవలందించనున్నాయి. నగరానికి అతి సమీపంలో ఉన్న సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎస్‌హెచ్‌జీ మహిళలు ఈ క్యాబ్‌లను నడపనున్నారు. ఇందుకోసం జిల్లాలోని 35 మంది మహిళలను గుర్తించారు. వీరికి ఇప్పటికే కార్‌ డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చారు. డ్రైవింగ్‌ లైసెన్స్‌లు కూడా జారీ చేశారు. వీరు క్యాబ్‌ కార్లు కొనుక్కునేందుకు వీలుగా ఒక్కో సభ్యురాలికి రూ.ఐదు లక్షల చొప్పున బ్యాంకు రుణం అందజేయనున్నారు. 

హైదరాబాద్‌లో ఉన్న ఐటీ కంపెనీలకు ఈ క్యాబ్‌లను అనుసంధానం చేస్తారు. ఈ మేరకు కొండాపూర్, హైటెక్‌ సిటీ, నానక్‌రాంగూడ తదితర ప్రాంతాల్లో ఉన్న ఐటీ కంపెనీలకు లేఖలు రాయాలని సంగారెడ్డి కలెక్టర్‌ వల్లూరు క్రాంతి నిర్ణయించారు. 

మహిళా ఉద్యోగులను తరలించేందుకు ఈ ఎస్‌హెచ్‌జీ మహిళల క్యాబ్‌లను వినియోగించుకోవాలని ఆయా కంపెనీలతో ఒప్పందం చేసుకుంటారు. దీంతో ఐటీ ఉద్యోగాలు చేసే మహిళలు అర్ధరాత్రి సైతం సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చడంతోపాటు, ఎస్‌హెచ్‌జీ మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని భావిస్తున్నారు.  

సబ్సిడీ కోసం ప్రతిపాదనలు  
స్వయం సహాయక సంఘాల మహిళలకు రూ.లక్షల్లో ధరలుండే కార్లను కొనుగోలు చేయడం ఆర్థిక భారంతో కూడుకున్న వ్యవహారం. దీనిని అధిగమించేందుకు ఎస్సీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల నుంచి సబ్సిడీ వర్తింపచేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. కార్ల కొనుగోలుకు అవసరమైన బ్యాంకు రుణాల మంజూరు ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అదనపు ప్రాజెక్టు డెరైక్టర్‌ జంగారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గతంలో ఇదే తరహాలో సంగారెడ్డి జిల్లాలో కొందరు మహిళలకు షీక్యాబ్‌ల పేరుతో రూ.లక్షల్లో సబ్సిడీలు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకున్నారు. ఈ కార్లు కిరాయికి పెట్టేలా అధికారులు పెద్దగా ప్రోత్సహించలేదు. దీంతో ఆశించిన మేరకు సేవలందించలేదు. ఇప్పుడు అలా కాకుండా ఐటీ కంపెనీలతో మాట్లాడి, స్వయం ఉపాధి కల్పించేలా అడుగులు పడుతున్నాయి.  

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)