Breaking News

ప్రేమ పెళ్లి.. ఆపై అనుమానంతో భార్యను..

Published on Tue, 01/21/2025 - 07:06

కుషాయిగూడ: కుషాయిగూడ పోలీస్‌స్టేషన్, నాగార్జుననగర్‌ కాలనీ రోడ్డు నెంబరు–5లో గత శనివారం వెలుగుచూసిన మహిళ అనుమానాస్పద మృతి కేసును పోలీసులు ఛేదించారు. భార్యపై అనుమానంతోనే  హతమార్చి సహజ మరణంగా చిత్రీకరించేందుకు యత్నించి పరారయ్యాడు. సోమవారం ఎస్సై వెంకన్న కేసు వివరాలను వెల్లడించారు. 

కాచిగూడకు చెందిన సచిన్‌ సత్యనారాయణ, టూగూర్‌ స్నేహలు 2021లో ఇన్‌స్ట్రాగామ్‌లో పరిచయమై 2022లో ప్రేమ వివాహం చేసుకున్నారు.  వీరికి ఓ బాబు పుట్టి చనిపోయాడు. ఈ క్రమంలో వారి మధ్య గొడవల కారణంగా కొద్ది రోజుల పాటు వేరుగా ఉండి నెల రోజుల క్రితమే తిరిగి నాగార్జుననగర్‌ కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉంటున్నారు. భార్య 7 నెలల గర్భవతి అని తెలుసుకున్న భర్త ఆమెను అనుమానించాడు. శారీరకంగా దూరంగా ఉన్నా గర్భం రావడంపై అనుమానం పెంచుకున్నాడు. 

ఈ క్రమంలో ఈనెల 16న తెల్లవారు జామున 5 గంటల సమయంలో మంచంపై పడుకున్న భార్య ముఖంపై దిండు అదిమిపెట్టి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. ఘటన స్థలంలో సిలిండర్‌ ఆన్‌చేసి సహజమరణంగా చిత్రీకరించేందుకు యత్నించి పరారయ్యాడు. ఆమె మృతిపై అనుమానం వచ్చిన పోలీసులు సోమవారం మృతురాలి భర్తను కాచిగూడలోని అతడి ఇంట్లో అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. తానే హతమార్చినట్లు నేరం అంగీకరించినట్లు ఎస్సై పేర్కొన్నారు. నిందితుడిని కోర్టు ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామన్నారు.  

 

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)