Breaking News

ప్రియుడి మోసం.. గర్భవతి కావడంతో యువతి ఆత్మహత్య

Published on Mon, 11/14/2022 - 08:28

కరీంనగర్: ప్రేమ పేరుతో గర్భవతిని చేసి ఆపై ప్రియుడు ముఖం చాటేయడంతో గిరిజన యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన కౌటాల మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం... గురుడుపేట గ్రామానికి చెందిన ఎర్మ సత్తయ్య భక్కుబాయి దంపతులకు కూతురు అంజలి(19) ఇంటర్‌ పూర్తి చేసి మంచిర్యాలలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో లాబ్‌ టెక్నిషీయన్‌గా పని చేస్తుంది.

ఇదే క్రమంలో అదే ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నిషియన్‌గా విధులు నిర్వహిస్తున్న  చింతలమానెపల్లి మండలంలోని రుద్రాపూర్‌ గ్రామానికి చెందిన యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో శరీరకంగా దగ్గరయ్యారు. దీంతో అంజలి గర్భవతి కావడంతో ఆ విషయాన్ని ప్రియుడికి తెలిపింది. పెళ్లి చేసుకోవాలని కోరడంతో ముఖం చాటేశాడు. 

దీంతో తాను మోసపోయానని మూడు నెలల క్రితం స్వగ్రామమైన గురుడుపేటకు వచ్చింది. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతోంది. శనివారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. బంధువులు గమనించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో కాగజ్‌నగర్‌ మండలంలోని ఈజ్‌గాంలోని ప్రైవేట్‌ క్లినిక్‌లో చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం కాగజ్‌నగర్‌కు శనివారం రాత్రి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతిచెందింది. 

డీఎస్పీ విచారణ...
యువతి మృతిచెందిన వార్తను తెలుసుకున్న కాగజ్‌నగర్‌ డీఎస్పీ కరుణాకర్, కౌటాల సీఐ బుద్దే స్వామి, ఎస్సై  ప్రవీణ్‌కుమార్‌ గురుడుపేట గ్రామానికి చేరుకుని యువతి మృతదేహాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. మృతురాలి తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిర్పూర్‌(టి) సామాజిక ఆసుపత్రికి తరలించారు.   

Videos

మస్క్ స్టార్ షిప్ ప్రయోగం ఫెయిల్

సంచలన నిర్ణయం తీసుకున్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం

నా దారి దొంగదారి !

లోకేష్ పై పోతిన మహేష్ సెటైర్లే సెటైర్లు

మహానాడు పరిస్థితి చూశారా? తమ్ముళ్లా మజాకా!

బాబు సర్కార్ మరో బంపర్ స్కామ్

సూపర్ సిక్స్ పథకాలకు డబ్బులేవ్.. కానీ మహానాడుకి మాత్రం

హైదరాబాద్ లో దంచికొట్టిన వాన

థియేటర్ల బంద్ కుట్ర వెనుక జనసేన నేత.. పార్టీ నుంచి సస్పెండ్

ఐపీఎల్-18లో క్వాలిఫయర్-1కు దూసుకెళ్లిన RCB

Photos

+5

NTR Jayanthi : ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద జూ. ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్‌ నివాళి (చిత్రాలు)

+5

వోగ్ బ్యూటీ అవార్డ్స్ లో మెరిసిన సమంత, సారా టెండూల్కర్ (ఫొటోలు)

+5

భర్త బర్త్‌ డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్న బాలీవుడ్ బ్యూటీ సోహా అలీ ఖాన్ (ఫొటోలు)

+5

మదర్ డ్యూటీలో కాజల్.. కొడుకుతో కలిసి ఇలా (ఫొటోలు)

+5

సతీసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నిర్మాత దిల్ రాజు (ఫొటోలు)

+5

ఆర్జే కాజల్ గృహప్రవేశంలో ప్రియాంక సింగ్ సందడి (ఫొటోలు)

+5

విశాఖపట్నం : మహిళల మనసు దోచిన ‘చిత్రకళ’ (ఫొటోలు)

+5

చివరి రోజు కిక్కిరిసిన భక్తులు..ముగిసిన సరస్వతీ నది పుష్కరాలు (ఫొటోలు)

+5

ముంబై అతలాకుతలం.. నీటిలో మహా నగరం (ఫొటోలు)

+5

శ్రీలంకలో అనసూయ.. ఫ్యామిలీతో కలిసి వెకేషన్ (ఫొటోలు)