Breaking News

నీ భర్తను వదిలేసి నాతో రా... దుబాయ్‌కి వెళ్ళిపోదాం

Published on Sat, 03/22/2025 - 08:23

హైదరాబాద్‌: దుబాయ్‌లో ఓ పబ్‌లో డ్యాన్సర్‌గా పనిచేస్తున్న హైదరాబాదీ యువతికి అక్కడే పరిచయయమైన యువకుడు మానసిక వేధింపులకు గురిచేయడంతో పాటు ఆమె భర్త, కుటుంబ సభ్యులకు వ్యక్తిగత వీడియోలు షేర్‌ చేస్తూ బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత డ్యాన్సర్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు దుబాయ్‌కు చెందిన నౌషాద్‌ అబూ బాకర్‌పై  కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే..యూసుఫ్‌గూడ శ్రీకృష్ణానగర్‌లో నివసించే యువతి (38) 2018 అక్టోబర్‌ 6వ తేదీన ఉపాధి నిమిత్తం దుబాయ్‌కు వెళ్లింది.

దుబాయ్‌లోని సౌత్‌ ఇండియా పబ్‌లో డ్యాన్సర్‌గా చేరింది. పబ్‌ సూపర్‌వైజర్‌ ఆమెకు ఏదైనా పని ఉంటే నౌషాద్‌ అబూబాకర్‌ను సంప్రదించాలని నెంబర్‌ ఇచ్చాడు. అప్పటి నుంచి తరచూ నౌషాద్‌ ఆమెతో ఫోన్‌లో మాట్లాడేవాడు. అయితే వీడియోలు తీసుకుని కొంతకాలంగా బ్లాక్‌ మెయిలింగ్‌కు పాల్పడుతున్నాడు. 2020లో ఆమె హైదరాబాద్‌కు తిరిగి వచ్చింది. ఆ సమయంలోనే అబూబాకర్‌ ఆమెతో ఫోన్‌లో మాట్లాడుతూ తిరిగి దుబాయ్‌ పబ్‌కు రావాలని, లేకపోతే వీడియోలు, ఫోటోలు కుటుంబసభ్యులకు షేర్‌ చేస్తానంటూ బెదిరించడంతో ఆమె తిరిగి దుబాయ్‌కు వెళ్లింది. 

ఇద్దరి మధ్య వీడియోల విషయంలో గొడవ జరిగింది. ఫోన్‌లో నుంచి వీడియోలు, ఫోటోలు డిలీట్‌ చేయాలని సూచించి తిరిగి హైదరాబాద్‌కు వచ్చింది. ఆరు నెలల తర్వాత అబూబాకర్‌ దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి ఆమెకు ఫోన్‌ చేశాడు. ఇంటి నుంచి బయటకు రావాలని లేకపోతే భర్తతో పాటు కుటుంబ సభ్యులకు వీడియోలు పంపిస్తానని బెదిరించాడు. అయినా ఆమె వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయింది. 

ఇదే అదునుగా నిందితుడు ఆమె ఫోటోలు, వీడియోలను భర్తకు, కుటుంబ సభ్యులకు పంపించాడు. తాను ఆమెను పెళ్లి చేసుకున్నానని, వదిలిపెట్టాలంటూ భర్తను హెచ్చరించాడు. ఈ వేధింపులు తట్టుకోలేక, అబూబాకర్‌ బ్లాక్‌మెయింలింగ్‌ భరించలేక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)