Breaking News

ఒకే కాన్పులో నలుగురు శిశువులు జననం

Published on Sun, 03/30/2025 - 10:46

నాంపల్లి: నిలోఫర్‌ ఆసుపత్రిలో ఒకే కాన్పులో ఓ మహిళ నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. పిల్లలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారు. కోలుకున్న తల్లీపిల్లలను శనివారం డిశ్చార్జ్‌ చేశారు. ఆసుపత్రి వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం... నగరంలోని హస్తినాపురం ప్రాంతానికి చెందిన అమృత (24) పురిటి నొప్పులతో ఫిబ్రవరి 22న నిలోఫర్‌లో అడ్మిట్‌ అయ్యారు. 

ఏడున్నర నెలలకి పురిటి నొప్పులు రావడంతో నిలోఫర్‌ వైద్యులు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి పెద్దాపరేషన్‌ చేశారు. ఈ కాన్పులో ఇద్దరు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. వీరి బరువు 1.6 కేజీ, 1.5 కేజీ, 1.4 కేజీ, 1.2 కేజీలుగా ఉన్నారు. 

శిశువులకు పుట్టుకతో శ్వాస సంబంధమైన సమస్య తలెత్తడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. నిలోఫర్‌ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎన్‌.రవికుమార్, ఎన్‌హెచ్‌ఓడీ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ నియోనటాలజీ ప్రొఫెసర్‌ ఎల్‌.స్వప్న పర్యవేక్షణలో పూర్తిస్థాయిలో పదిరోజుల పాటు చికిత్సలు అందించారు. నిలోఫర్‌ వైద్యుల పర్యవేక్షణలో పిల్లలు ఇన్ఫెక్షన్, కామెర్లు, కంటి సమస్యల నుంచి బయటపడ్డారు. 35 రోజుల ట్రీట్‌మెంట్‌ తర్వాత నలుగురు పిల్లలు డిశ్చార్జ్‌ అయ్యారు.  

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)