Breaking News

Hyderabad: ఆర్టీసీ బస్సులో పురుడు పోశారు..

Published on Sat, 07/06/2024 - 07:28

కాచిగూడ (హైదరాబాద్‌): పురిటి నొప్పులు పడుతున్న గర్భిణికి బస్సులోనే డెలివరి చేసి ఆర్టీసీ సిబ్బంది మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు. నగరానికి చెందిన శ్వేతారత్నం అనే గర్భిణి ఆరాంఘర్‌లో ముషీరాబాద్‌ డిపోకు చెందిన బస్సులో (టీఎస్‌వో 2జెడ్‌ 0341) శుక్రవారం ఉదయం 7:30 గంటల సమయంలో ఎక్కారు. ఆ బస్సులో డ్రైవర్‌ ఎం.అలీ, కండక్టర్‌ బి.సరోజ విధుల్లో ఉన్నారు.

 బస్సు బహదూర్‌పురా వద్దకు రాగానే శ్వేతారత్నంకు నొప్పులు రావడంతో బస్సు డ్రైవర్‌ బస్సును పక్కనే ఆపి ప్రయాణికులను దించాడు. బస్సు కండక్టర్‌ బి.సరోజ తోటి ప్రయాణికుల సహాయంతో శ్వేతారత్నంకు డెలివరీ చేశారు. శ్వేతారత్నం ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని జజ్జిఖానాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లి అడ్మిట్‌ చేశారు. మహిళకు పురుడు పోసిన కండక్టర్‌ సరోజను పలువురు ప్రయాణికులు అభినందించారు. 

ముషీరాబాద్‌ ఇన్‌చార్జి డీఎం రఘు అలీ, సరోజలను అభినందించారు. ఆర్టీసీ హైదరాబాద్‌ సిటీ రీజినల్‌ మేనేజర్‌ వరప్రసాద్, డిప్యూటీ ఆర్‌ఎంఓ జగన్, కాచిగూడ డీఎం, ముషీరాబాద్‌ డిపో ఇన్‌చార్జి డీఎం రఘు, బర్కత్‌పుర డీఎం వేణుగోపాల్, ముషీరాబాద్‌ అసిస్టెంట్‌ మేనేజర్‌ కళ్యాణి తదితరులు డ్రైవర్, కండక్టర్‌లను అభినందించి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ డ్రైవర్, కండక్టర్లకు అభినందనలు తెలియజేశారు.

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు