Breaking News

వివాహం ఇష్టం లేక ఆత్మహత్య

Published on Sat, 08/09/2025 - 13:18

పెద్దపల్లి: పట్టణంలోని జ్యోతినగర్‌కు చెందిన వనపర్తి సంధ్య(27) వివాహం ఇష్టంలేక, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వనపర్తి కనుకయ్య, లక్ష్మి మూడో కుమార్తె సంధ్యకు ఇటీవల వివాహం నిశ్చయమైంది. ఈ నెల 14న వివాహం కావాల్సి ఉంది.  శుక్రవారం ఉదయం ఇంట్లో వారు పెళ్లి పనుల్లో ఉండగా.. ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని మృతి చెందింది. మృతురాలి తండ్రి కనుకయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నరేశ్‌రెడ్డి తెలిపారు. 

దొంగతనం మోపారని యువకుడు..
జూలపల్లి(పెద్దపల్లి): తనపై దొంగతనం మోపారనే అవమాన భారంతో వడ్కాపూర్‌ గ్రామానికి చెందిన ఐలవేని రంజిత్‌(25) చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.  పోలీసుల కథనం ప్రకారం.. వడ్కాపూర్‌ గ్రామానికి రంజిత్‌ ఈనెల 6న సాయంత్రం మద్యం కొనుగోలు కోసం అదేగ్రామంలోని అంగరి రజిత బెల్ట్‌షాపుకు వెళ్లాడు. బీరు కొనుగోలు చేసి తాగాడు. ఇంటికి వెళ్లేందుకు సిద్ధం కాగా.. కౌంటర్‌లోని డబ్బులు లేవని, ఆ డబ్బు తీశాడనే నెపంతో బెల్ట్‌షాపు నిర్వాహకులు రంజిత్‌ బట్టలు విప్పి తనిఖీ చేశారు. 

దీనిని అవమానంగా భావించిన యువకుడు.. ఇంటికి వెళ్లాడు. తాను కరీంనగర్‌ వెళ్లి పని చేసుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లాడు. అయితే, గురువారం కుటుంబ సభ్యులు వ్యవసాయ పనులకు వెళ్లగా.. ఇంటికి వచి్చన రంజిత్‌ చీరతో దూలానికి ఉరివేసుకుని చనిపోయాడు. తల్లిదండ్రులు సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా తలుపులు పెట్టి ఉన్నాయి. కిటికిలోంచి చూడగా రంజిత్‌ ఉరి వేసుకుని కనిపించాడు. మృతుని తండ్రి రాజమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సనత్‌కుమార్‌ తెలిపారు.
 

Videos

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)