Breaking News

కడుపులోనే శిశువు.. కాసేపటికే తల్లి

Published on Sat, 03/01/2025 - 08:08

కోనరావుపేట(వేములవాడ): ఓ గర్భిణిని ప్రసవం కోసం ఆస్పత్రికి తీసుకెళ్తే.. శిశువు కడుపులోనే చనిపోగా.. పరిస్థితి విషమించి, కాసేపటికే తల్లి మృతిచెందింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామస్తుల వివరాల ప్రకారం.. కోనరావుపేట మండలం పల్లిమక్త గ్రామానికి చెంది సిద్దరవేణి బాబుకు కొండాపూర్‌ గ్రామానికి చెందిన లాస్యతో ఏడాది క్రితం వివాహం జరిగింది. గర్భిణి అయిన లాస్యను కుటుంబసభ్యులు ప్రసవం నిమిత్తం గురువారం వేములవాడ ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది ఇంజక్షన్‌ వేయడంతో ఆమెకు ఫిట్స్‌ వచ్చాయి. 

దీంతో వారు ఆందోళనకు గురై, కరీంనగర్‌ తీసుకెళ్లాలని సూచించారు. బాధితులు సిరిసిల్ల ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు కరీంనగర్‌ వెళ్లాలని చెప్పడంతో వెంటనే అక్కడికి తీసుకెళ్లారు. వైద్యులు లాస్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పి, హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి పంపించారు. శుక్రవారం తెల్లవారుజామున అక్కడికి చేరుకోగా వైద్యులు ఆపరేషన్‌ చేసి, మృత శిశువును బయటకు తీశారు. పరిస్థితి విషమించడంతో కాసేపటికే తల్లి లాస్య కూడా మృతిచెందినట్లు తెలిపారు. ఈ ఘటనతో పల్లిమక్త, కొండాపూర్‌లలో విషాదం నెలకొంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)