Breaking News

అమ్మ..ఇక రాదు కన్నా..!

Published on Sat, 01/03/2026 - 06:44

హైదరాబాద్‌: ‘‘పిల్లలూ..ఇక్కడ కూర్చొని ఈ ఫోన్‌తో ఆడుకోండి.. నేను కాసేపటి తరువాత వస్తా’’ అంటూ వెళ్లిన తల్లి అనంతలోకాలకు వెళ్లిపోయింది. అమ్మ.. ఇక రాదని తెలియని ఆ చిన్నారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. నాలుగేళ్ల క్రితం తండ్రి మృతి చెందగా.. ఇపుడు అమ్మ కూడా పిల్లలను కూడా వదలి వెళ్లింది. హృదయ విదారకమైన ఈ సంఘటన శుక్రవారం జరిగింది. లేక్‌పోలీసులు తెలిపిన మేరకు.. పహాడీషరీఫ్‌కు చెందిన వసంత (29) భర్త లక్ష్మణ్‌ నాలుగేళ్ల క్రితం మృతి చెందాడు. వీరికి కుమారుడు నందు, కుమార్తె చెర్రి ఉన్నారు. భర్త మృతి అనంతరం సోదరుడు, తల్లితో ఉంటూ కూలీపనిచేస్తూ జీవనం సాగిస్తోంది.  ఇటీవల కాలంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. 

శుక్రవారం సాయంత్రం పిల్లలను తీసుకుని ట్యాంక్‌బండ్‌కు వచ్చింది. వారిని లవ్‌ హైదరాబాద్‌ దగ్గర బెంచీపై కూర్చోబెట్టి మొబైల్‌ ఫోన్‌ ఇచ్చి ఆడుకోమని చెప్పి వెళ్లింది. అయితే కాసేపటికే ఆమె హుస్సేన్‌ సాగర్‌లో దూకింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన చేరుకోగా  అప్పటికే ఆమె నీటిలో మునిగిపోయింది. అదే ప్రాంతంలో గాలించగా మృతదేహం లభించింది. పిల్లల దగ్గర ఉన్న మొబైల్‌ ఫోన్‌ ద్వారా మృతురాలు వసంతగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు.  

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)