Breaking News

Water Heater: విద్యుత్‌ షాక్‌తో నర్సు మృతి

Published on Sun, 07/28/2024 - 08:43

ఖైరతాబాద్‌: గదిలో హీటర్‌ పెట్టుకునే క్రమంలో విద్యుత్‌ షాక్‌కు గురై యువతి మృతిచెందిన సంఘటన ఖైరతాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కరీంనగర్‌కు చెందిన కె.సౌమ్య (20) ఖైరతాబాద్‌లో నివాసం ఉంటూ వాసవీ హాస్పిటల్‌లో నర్సుగా పనిచేస్తుంది. 

శుక్రవారం సాయంత్రం డ్యూటీకి వెళ్లాల్సి ఉండగా సౌమ్య స్నేహితుడు ప్రశాంత్‌ ఆమెకు ఫోన్‌చేసినా లిఫ్ట్‌ చేయకపోవడంతో అనుమానంతో రాత్రి 7.30గంటల ప్రాంతంలో గదికి వచ్చి తలుపు తట్టగా తీయలేదు. దీంతో స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూడగా గదిలో బాత్‌రూం పక్కనే సౌమ్య హీటర్‌ మీదపడి అచేతనంగా కని్పంచింది. వెంటనే హీటర్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఆమెను హాస్పిటల్‌కు తరలించగా డ్యూటీ డాక్టర్‌ పరిశీలించి అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. 

గదిలో హీటర్‌ స్విచ్‌ఆన్‌ చేసి బకెట్‌లో వేసే క్రమంలో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మృతిచెంది ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. శరీరంపై హీటర్‌ వల్ల కాలిన గాయాలు ఉన్నాయి. ఈ మేరకు మృతురాలి తల్లి భాగ్యలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)