Ameerpet: స్నేహితుడి భార్యపై లైంగిక దాడికి యత్నం

Published on Tue, 05/13/2025 - 07:49

అమీర్‌పేట(హైదరాబాద్): స్నేహితుడి భార్యపై కన్నేసిన ఓ కామాంధుడు భర్త ఇంట్లో లేని సమయంలో ఆమెపై లైంగిక దాడికి యత్నించిన సంఘటన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బల్కంపేటకు చెందిన మహిళ భర్త గతంలో ప్రైవేటు సంస్థలో పనిచేసేవాడు. 

అతడి స్నేహితుడైన పసుపులేటి వెంకట నరసింహారావు అలియాస్‌ పీవీ అనే వ్యక్తి అతడితో ఉద్యోగం మాన్పించి తన సొంత సంస్థ అయిన లోన్‌ వాలా డాట్‌ కామ్‌లో చేర్చుకున్నాడు. ఉద్యోగం ఇచ్చాననే సాకుతో తరచూ స్నేహితుడి ఇంటికి వెళ్లే వాడు. స్నేహితుడి భార్యపై కన్నేసిన అతను తన కోరిక తీర్చాలంటూ ఆమెను వేధిస్తున్నాడు. ఆమె ఫోన్‌కు అసభ్యకరమైన మెసేజ్‌లు పంపేవాడు. 

బాధితురాలు ఈ విషయం భర్త దృష్టికి తీసుకెళ్లడంతో అతను పీవీ వద్ద పని మానేసి మరో సంస్థలో చేరాడు. ఆదివారం మధ్యాహ్నం స్నేహితుడు లేని సమయంలో ఇంట్లోకి చొరబడిన పీవీ ఆమెపై  లైంగిక దాడికి యత్నించాడు. అతడి భారి నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. గర్భవతినని చెప్పినా వినిపించుకోకుండా లైంగిక దాడికి యత్నించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)