హైడ్రా భయంతో మహిళ ఆత్మహత్య

Published on Sat, 09/28/2024 - 05:41

కూకట్‌పల్లి (హైదరాబాద్‌): హైడ్రా అధికారులు తమ ఇళ్లు కూడా కూల్చివేస్తారేమో అన్న భయంతో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. కూకట్‌పల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..కూకట్‌పల్లి రామాలయం సమీపంలోని యాదవబస్తీకి చెందిన గుర్రంపల్లి బుచ్చమ్మ (56 ).. భర్త శివయ్యతో కలిసి సొంత ఇంటిలో నివసిస్తోంది. వీరికి నల్లచెరువు సమీపంలో మరో రెండు ఇళ్లు, కారు షెడ్డు ఉన్నాయి. వీటిని అద్దెకు ఇచి్చన భార్యాభర్తలు పాల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి ముగ్గురు కుమార్తెలకు వివాహాలు కావడంతో తమ ఇళ్లను వారికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.

అయితే గత ఆదివారం హైడ్రా అధికారులు నల్లచెరువు ఎఫ్‌టీఎల్‌లో ఉన్న కొన్ని అక్రమ నిర్మాణాలను తొలగించారు. వీటికి ఎదురుగానే రోడ్డుకు ఆవతలి వైపు బుచ్చమ్మ ఇళ్లు, కారు షెడ్డు ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలను సైతం హైడ్రా అధికారులు కూల్చేస్తారని స్థానికులు చర్చించుకుంటున్నారు. దీంతో బుచ్చమ్మ ఆందోళనకు గురై శుక్రవారం సాయంత్రం భర్త హాల్లో ఉండగానే బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ‘మా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కష్టపడి మా కోసం ప్లాట్లు కొని ఇళ్లు కట్టించారు. అయితే హైడ్రా వాళ్లు చుట్టుపక్కల ఇళ్లు పడగొడుతున్నారు. మా ఇళ్లూ అలాగే అవుతాయనే టెన్షన్‌తో మా అమ్మ ఆత్మహత్య చేసుకుంది..’ అని బుచ్చమ్మ కుమార్తె సరిత చెప్పింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)