Breaking News

పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించిన యువతి

Published on Sun, 01/26/2025 - 08:27

సాక్షి, హైదరాబాద్‌: మ్యాట్రిమోనీలో పరిచయమైన ఓ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిట్టనిలువునా మోసగించిందో కిలేడీ. ఈ కేసులో తిరుపతికి చెందిన తమ్మ హేమమణి అలియాస్‌ ప్రీతి రెడ్డి..ఆమెకు సహకరించిన కొండారెడ్డిలను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసి, జ్యూడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నగరానికి చెందిన 45 ఏళ్ల బాధితుడికి గతేడాది మేలో విడాకుల మ్యాట్రిమోనీ యాప్‌ ద్వారా హేమమణితో పరిచయం ఏర్పడింది. తాను ఎంబీబీఎస్, ఎండీ అర్హతలు కలిగిన కార్డియాలజిస్ట్‌ అని పరిచయం చేసుకుంది. విడాకులు తీసుకొని భర్తతో దూరంగా ఉన్నట్లు పేర్కొంది.

 దీంతో తక్కువ కాలంలోనే పలు సామాజిక మాధ్యమాలలో ఇరువురూ సన్నిహితులుగా మారిపోయారు. కొంతకాలం తర్వాత నిందితురాలు వివాహ ప్రతిపాదన తీసుకొచ్చింది. దీంతో బాధితుడు అంగీకరించారు. కొన్ని రోజుల తర్వాత ఆమె రోగికి చికిత్స చేయడానికి నిధులు అవసరమని పేర్కొంటూ బాధితుడి నుంచి సొమ్ము వసూలు చేసింది. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు. తర్వాత ఆమె బాధితుడిని మళ్లీ సంప్రదించి తన తల్లి చనిపోయిందని అత్యవసరంగా ఇంకొంత సొమ్ము అవసరముందని చెప్పింది. పలు లావాదేవీల్లో మొత్తం రూ.4.97 లక్షలు వసూలు చేసింది. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాధానం లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ మధులత నేతృత్వంలోని బృందం ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.  

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)