Breaking News

ఇల్లరికం వచ్చిన భర్తను హత్య చేయించిన భార్య

Published on Sun, 03/30/2025 - 11:38

నిజామాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను భార్య అంతమొందించింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండలం నాగారం గ్రా మానికి చెందిన అమృతం విఠల్‌ (38) అనే వ్యక్తి 20 ఏళ్ల కిత్రం సోమేశ్వర్‌ గ్రామంలోని మేనమామ కూతురు కాశవ్వను పెళ్లి చేసుకొని ఇల్లరికం వచ్చాడు. 

మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా, ఒక్కరికి పెళ్లి అయింది. విఠల్‌ భార్య కాశవ్వ నాగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. విఠల్‌ను అంతమొందిస్తే ఏ గొడవా ఉండదని భావించిన కాశవ్వ అదే గ్రామానికి చెందిన అమృతం విఠల్‌(నిందితుడు), పుల్కంటి విఠల్‌కు విషయం తెలిపింది. 

శుక్రవారం రాత్రి విఠల్‌(మృతుడు)ను పొలం వద్దకు తీసుకెళ్లిన అమృతం విఠల్, పుల్కంటి విఠల్‌ అతిగా మద్యం తాగించి మెడకు టవల్‌తో గట్టిగా బిగించి, పైపులతో కొట్టి చంపారు. అనంతరం విఠల్‌ మృతదేహాన్ని కొల్లూర్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో బాన్సువాడ–బీర్కూర్‌ ప్రధాన రహదారిపై పడేసి వెళ్లారు. ఉదయం అటుగా వెళ్తున్న కొందరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. 

మృతుడి అన్న బింగి సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి భార్య కాశవ్వ, అమృతం విఠల్, పుల్కంటి విఠల్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, విఠల్‌ను తామే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని సీఐ అశోక్‌ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు పంపనున్నట్లు సీఐ పేర్కొన్నారు.    

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)