కూకట్‌పల్లిలో మట్టుబెట్టి.. అందోల్‌కు తరలించి..

Published on Mon, 09/16/2024 - 14:04

జోగిపేట(అందోల్‌): భార్యపై అనుమానంతో కూకట్‌పల్లిలో హత్య చేసి మృతదేహాన్ని అందోల్‌కు తరలించాడు. అనారోగ్యంతో చనిపోయిందని నమ్మించేందుకు యత్నించాడు. మృతురాలి కుటుంబీకులు అనుమానంతో  నిలదీస్తే హత్య చేసిన విషయాన్ని బయటపెట్టాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేట మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. 

పోలీసుల కథనం ప్రకారం..  అందోల్‌కు చెందిన వెండికోలు నర్సింహులు చాలాకాలంగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌ ప్రాంతంలో స్థిరపడి ఇక్కడే నివసిస్తూ గ్యాస్‌ డెలివరీ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. 13 ఏళ్ల క్రితం మెదక్‌ జిల్లా చిటు్కల్‌కు చెందిన ఇందిర (33)ను వివాహం చేసుకున్నాడు. ఆమెకు సంతానం కలగకపోవడంతో ఐదేళ్ల క్రితం మరో మహిళను  రెండో వివాహమాడాడు. దీంతో ఆమెకు ఇద్దరు సంతానం. ఈ క్రమంలో అతను కూకట్‌పల్లిలో మూడంతస్తుల భవనాన్ని నిర్మించాడు. అందులోనే ఇద్దరు భార్యలతో సంసార జీవితాన్ని గడుపుతున్నాడు. మొదటి భార్య ఆ భవనంలోనే కిరాణ షాపు నడుపుతోంది.

 కొన్ని రోజులుగా ఇందిరకు ఫోన్‌కాల్స్‌ ఎక్కువగా రావడంపై నర్సింహులు అనుమానం పెంచుకున్నాడు. దీనివల్ల కొంతకాలంగా ఇద్దరూ గొడవపడుతున్నారు. ఆదివారం కూడా గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే కోపాద్రిక్తుడైన అతను టవల్‌ను గొంతుకు చుట్టి ఇందిరకు శ్వాస ఆడకుండా చేసి హత్య చేశాడు. కూకట్‌పల్లి నుంచి అందోల్‌కు మృతదేహం తీసుకెళ్లి అనారోగ్యంతో మృతిచెందినట్లుగా చెప్పే ప్రయత్నం చేశాడు. మృతురాలి కుటుంబీకులు అనుమానంతో గట్టిగా నిలదీస్తే తానే చంపినట్లు కుటుంబ సభ్యులకు తెలిపాడు. దీంతో మృతురాలి తల్లి మొగులమ్మ  పోలీసులకు ఫిర్యాదు చేయగా నర్సింహులుపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుని విచారిస్తే నేరం ఒప్పు కున్నట్లు సీఐ అనిల్‌కుమార్‌ తెలిపారు. ఇందిర మృతదేహన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)