Breaking News

వ్యభిచారం చేసైనా డబ్బులు తెమ్మన్నాడు..

Published on Wed, 09/11/2024 - 07:26

లంగర్‌హౌస్‌: వ్యభిచారం చేసైనా సరే మద్యం తాగేందుకు డబ్బులు తేవాలని వేధిస్తున్నందునే స్వయంగా భార్యే భర్తను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. లంగర్‌హౌస్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఈ నెల 7న జరిగిన హత్య కేసును  ఛేదించిన పోలీసులు నిందితురాలిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

 ఇన్‌స్పెక్టర్‌ రఘుకుమార్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వనపర్తి జిల్లా, పెద్దమందడి గ్రామానికి చెందిన ముక్తార్‌ అహ్మద్, నసీంబేగం దంపతులకు కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. మూడేళ్ల క్రితం ముక్తార్‌ లంగర్‌హౌస్‌ డ్రీమ్‌ కాలనీలో నిరి్మస్తున్న భవనానికి వాచ్‌మెన్‌గా పని చేస్తున్నాడు. పేకాటతో పాటు తాగుడుకు బానిసైనన ముక్తార్‌ తరచూ భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. ఈ నెల 7న సాయంత్రం మద్యం మత్తులో ఇంటికి వచ్చిన ముక్తార్‌ తనకు ఇంకా మద్యం  కావాలని అందుకు డబ్బులు కావాలని భార్యను వేధిచాడు. 

తన వద్ద డబ్బులు లేవని చెప్పడా వ్యభిచారం చేసైనా డబ్బులు తేవాలని రోడ్డుపైకి తోసేశాడు. దీంతో తలకు గాయమైన నసీంబేగం భర్తను అంతమొందించాలని నిర్ణయించుకుంది. షేక్‌పేట్‌ కల్లు కంపౌండ్‌కు వెళ్లి కల్లు తాగి వచి్చన ఆమె భవనంలో నిద్రిస్తున్న ముక్తార్‌పై బండరాళ్లతో దాడి చేసింది. అనంతరం అక్కడి నుంచి లంగర్‌హౌస్‌లోని దర్గాకు వెళ్లి దాక్కుంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నసీం బేగంను అదుపులోకి తీసుకోగా తానే హత్య చేసినట్లు తెలిపింది. నిందితురాలిని అరెస్ట్‌ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

 

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)