Breaking News

తన కంటే చిన్న వాడితో ప్రేమ.. భర్త, పిల్లల్ని కాదని ప్రియుడితో..

Published on Sun, 03/02/2025 - 12:46

సాక్షి, హైదరాబాద్‌: సోషల్‌ మీడియా పరిచయాలు కొందరికి శాపంగా మారుతున్నాయి. సోషల్‌ మీడియాలో పరిచయమైన వ్యక్తి కోసం ఓ వివాహిత భర్త, పిల్లలను వదిలేసి పారిపోయిన ఘటన మేడ్చల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. ప్రియుడితో పారిపోతున్న తన భార్యను భర్త పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ అది ఫలించలేదు. దీంతో, సదరు భర్త పోలీసులను ఆశ్రయించాడు.

వివరాల ప్రకారం..ఏపీలోని పల్నాడు జిల్లాకు చెందిన గోపి (22) కంప్యూటర్ ట్రైనింగ్ కోసం హైదరాబాద్‌కు వచ్చాడు. కూకట్‌పల్లిలోని హాస్టల్‌ ఉంటూ కోర్స్‌ నేర్చుకుంటున్నారు. ఈ క్రమంలో మేడ్చల్‌ జిల్లాలోని పేట్ బషీరాబాద్‌కు చెందిన సుకన్య(35)కు సోషల్‌ మీడియాలో పరిచయం ఏర్పడింది. దీంతో, వీరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. వీరద్దరూ రోజూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నారు. సుకన్యకు అప్పటికే వివాహం జరగగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. అయినా గోపి లేకుండా ఉండలేనని భావించిన సుకన్య.. ప్రియుడితో పారిపోయేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 5న ఇంట్లో నుంచి వెళ్లిపోయి గోపితో కలిసి ఉంటోంది.

తన భార్య సుకన్య కనిపించకపోవడంతో భర్త జయరాజ్‌ ఆందోళనకు గురయ్యాడు. వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో సీసీ కెమెరాల ఆధారంగా గోపితో వెళ్లిందని నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో జయరాజ్‌ వారికోసం గాలిస్తుండగా మేడ్చల్‌లోని ఆక్సిజన్ పార్క్ వద్ద బైక్‌పై వెళుతున్న గోపి, సుకన్య కనిపించారు. దీంతో వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా.. బైక్‌ను అక్కడే వదిలేసి సుకన్య, గోపి రన్నింగ్ బస్ ఎక్కి మళ్లీ పారిపోయారు. ఈ ఘటనలో భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వారి కోసం గాలిస్తున్నారు. 
 

Video Credit: Telugu Scribe

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)