Breaking News

ప్రియుడి మోజులో పడి భర్తను చంపిన భార్య

Published on Sun, 04/20/2025 - 12:11

వనపర్తి(మహబూబ్‌నగర్): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నా డని కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్‌ వెల్లడించారు. సూగూరు గ్రామానికి చెందిన రవి, అతడి భార్య సునీత మేస్త్రి నరేశ్‌ వద్ద పనిచేస్తుండే వారు. క్రమంలో శ్రీరంగాపూర్‌కు చెందిన అరవింద్‌తో సునీతకు పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది. 

ఈ విషయం భర్త రవికి తెలియడంతో అరవింద్‌ను హెచ్చరించాడు. అప్పటి నుంచి రవి తన భార్య సునీతను ఇబ్బంది పెడుతుండేవాడు. ఈ క్రమంలో తన భర్త అడ్డు తొలగించాలని ప్రియుడు అరవింద్‌కు చెప్పడంతో గత నెల 18న అతడు తన స్నేహితులైన భగవంతు, గిరితో కలిసి అయ్యవారిపల్లిలో మద్యం తాగుతూ రవి హత్యకు పథకం రచించారు. 

ఈ మేరకు మార్చి 19న సాయంత్రం అరవింద్‌ తన స్నేహితుడైన సూగూరుకు చెందిన బాష కారును అవసరం ఉందని తీసుకుని అయ్యవారిపల్లిలో భగవంతు, గిరిని ఎక్కించుకున్నాడు. వెంకటాపురంలో ఒక కిరాణం షాపులో మద్యం, వాటర్‌ బాటిల్స్‌, నల్ల కవర్స్‌ తీసుకున్నారు. అక్కడి నుంచి సూగూరుకు వెళ్లి ఆంజనేయులు అనే వ్యక్తితో రవికి ఫోన్‌ చేయించి మద్యం తాగుదామని పిలిపించారు. వారి వద్దకు వచ్చిన రవిని కారులో ఎక్కించుకుని గ్రామ సమీపంలోని శ్మశానవాటిక వద్దకు వెళ్లి మద్యం తాగారు. రవి మత్తులోకి వెళ్లిన తర్వాత అందరూ కలిసి అతడి ముఖానికి ప్లాస్టిక్‌ కవర్లు చుట్టి ఊపిరాకుండా చేసి చంపారు. 

ఎవరికీ అనుమానం రాకూడదని కొత్త సూగూరు ఊరి బయట రోడ్డు పక్కన శవాన్ని ఉంచి, నేరానికి ఉపయోగించిన ప్లాస్టిక్‌ కవర్లను బూడిదపాడు వద్ద వాగులో పడేసి వెళ్లిపోయా రు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టారు. సునీతను తమదైన శైలిలో విచారించగా.. చేసిన నేరాన్ని ఒప్పుకుంది. హత్య లో పాల్గొన్న వారిని అరెస్టు చేసి.. వారి నుంచి కారు, సెల్‌ఫోన్స్‌ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్‌ విధించినట్టు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ రాంబాబు, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ నరేష్‌, పెబ్బేరు ఎస్‌ఐ యుగంధర్‌ రెడ్డి ఉన్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)