Breaking News

తాళిబొట్టు తెంపేసి భార్యపై దాడి.. భర్తపై కేసు నమోదు

Published on Tue, 03/03/2026 - 12:37

బషీరాబాద్‌: ‘నాకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. నా భర్త మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని నన్ను, పిల్లలను చంపేందుకు కుట్ర చేస్తున్నాడు. తరచూ నాపై దాడికి పాల్పడుతున్నాడు. సోమవారం ఇంట్లో నుంచి బయటకు లాక్కొచ్చి తీవ్రంగా కొట్టాడు. మెడలో ఉన్న తాళి బొట్టు తెంపేశాడు. అతనితో నాకు, నా పిల్లలకు ప్రాణహాని ఉంది’ అంటూ ఓ మహిళ సోమవారం పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు, పోలీసులు తెలిపసిన వివరాల ప్రకారం.. 

ఎక్మాయికి చెందిన జోగి అశ్విని, జోగి రవికుమార్‌ భార్యభర్తలు. వీరికి లావణ్య, వితిక, సుభిక్ష ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. డ్రైవర్‌గా పనిచేసే తన భర్త నిత్యం తాగి వచ్చి తనతో పాటు పిల్లలను ఇబ్బంది పెడుతున్నాడని పోలీసుల ఎదుట వాపోయింది. ఈ విషయంలో పలుమార్లు పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినా అతని తీరు మారడం లేదని ఆవేదన వ్యక్తంచేసింది. తనకు, పిల్లలకు న్యాయం చేయాలని కోరింది. మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు జానకి బాధితురాలికి అండగా నిలిచారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.    

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)